తెలంగాణలోని సూర్యపేటలో సెప్టెంబర్ 26న ఐటీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి బ్రోచర్ టాస్క్ అధికారులతో కలిసి హైదరాబాద్ లో విడుదల చేశారు. అక్టోబర్ 2న ఐటీ హబ్ ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్ 26 న ఇంటర్వ్యూలు.. అదే రోజు నియామక పత్రాలు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఐటి శాఖ మంత్రి కెటిఆర్ పిలుపుతో ఉద్యోగుల ఎంపిక కోసం 9కంపెనీలు ముందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు. సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి 5గంటల వరకు ఈ జాబ్ మేళా కొనసాగుతుందని వెల్లడించారు. ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా క్యూ ఆర్ కోడ్ సదుపాయం కూడా కల్పించినట్లు తెలిపారు. మొదటి దఫాలో 250మంది యువతకు ఐటీ ఉద్యోగాలు వరించనున్నాయి. గత ఎన్నికల సందర్భంగా సూర్యాపేటలో ఐటి హబ్ తీసుకొస్తానని మంత్రి జగదీశ్ రెడ్డి వాగ్దానం చేశారు. మెట్రో నగరాలకే పరిమితమైన ఐటి హబ్ ను సూర్యాపేట లో ప్రారంభించనున్నారు.
ఉన్న ఊరిలోనే ఐటీ ఉద్యోగాలను చేసే అవకాశాన్ని యువతకు కల్పించడమే లక్ష్య గా ఐటీ హబ్ ను అక్టోబర్ 2న సూర్యాపేట లో ప్రారంభించనున్నారు. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వారది గా ఉన్నా సూర్యాపేట జిల్లా కేంద్రం లో కూడా వచ్చే నెల 2న మంత్రులు కెటిఆర్, జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఐటి హబ్ ప్రారంభం కానుంది. పాత కలెక్టరేట్ భవనం లో ప్రారంభం కానున్న సూర్యాపేట ఐటీ హబ్ లో ఏర్పాటు కానున్న కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళా పోస్టర్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
ఇది కూడా చదవండి: తెలంగాణ టీచర్ అభ్యర్థులకు అలర్ట్.. మారిన సిలబస్.. ఈ టాపిక్స్ చదవండి..!!
సూర్యాపేట లో ప్రారంభం కానున్న ఐటీ హబ్ లో 9 కంపెనీలలలో ఉద్యోగాల భర్తీకి భారీ జాబ్ మేళాను సెప్టెంబర్ 26 వ తేదీన నిర్వహించనున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు .. తెలంగాణ అకాడెమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళాను నిర్వహించనున్నారు. సూర్యాపేట లోని సదాశివ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకు జరిగే జాబ్ మేళా ను బీటెక్ చదివిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోని ఉపాధి అవకాశాలు పొందాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. రెండు రోజుల వ్యవధిలో నే తమ ఐటి కార్యకలాపాలను నిర్వహించేందుకు 9కంపెనీలు ముందుకు వచ్చాయని , భవిష్యత్తు లో మరిన్ని కంపెనీలు ముందుకు రానున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే మూడు ఏళ్ల కాలం లో వేలాది మంది కి విస్తరించి , ఐటి లో హైదరాబాద్ తరువాత సూర్యాపేట ను తీర్చిదిద్దుతామని మంత్రి తెలిపారు. అంతకు ముందు అధికారులతో కలిసి ఐటి హబ్ గా మార్చనున్ను పాత కలెక్టరెట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి వారం రోజుల్లో కార్పొరేట్ తరహా లో భవనాన్ని అన్ని హంగులతో తీర్చి దిద్దాలని ఆదేశించారు. కార్యక్రమం లో టిఎస్.ఐ.ఐ సి ఎండి నర్సింహ రెడ్డి, టాస్క్ డైరెక్టర్ శ్రీకాంత్ సిన్వా, ఐటి డైరెక్టర్ రంగినేని విజయ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.