Nushrratt Bharuccha: ఇజ్రాయెల్ (Israel) పై పాలస్తీనా సంస్థకు చెందిన హమాస్ ఉగ్రవాదులు గాజా నుంచి ఒకేసారి 500 రాకెట్లతో ఇజ్రాయెల్ పై దాడి చేసారు. హమాస్ ఉగ్రవాదుల దాడిలో సుమారు 200పైగా ఇజ్రాయెల్ కు చెందిన వారు చనిపోగా పలువురికి గాయాలయ్యాయి. ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదులు (Hamas Terrorists)చేసిన దాడిని వివిధ దేశాల ప్రతినిధులు ఖండిస్తున్నారు. ఈ దాడిలో సరిహద్దుల్లో ఉన్న కొంత మంది ఇజ్రాయెల్ సైనికులను నిర్బంధించి గాజాకు తీసుకెళ్లారు.
ప్రముఖ బాలీవుడ్ నటి నుస్రత్ భరుచ్చ “హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్”.(Haifa International Film Festival) కోసం ఇజ్రాయెల్ వెళ్లిన ఈ నటి ఇజ్రాయెల్ ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత నుంచి కనిపించటం లేదని పలు వార్తలు వినిపించాయి. ఫిల్మ్ ఫెస్టివల్.” కోసం వెళ్లిన నటి నుస్రత్ భరుచ్చ అనుకోని పరిస్థితుల్లో అక్కడ జరిగిన ఉగ్రవాద దాడుల కారణంగా ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయారని ఆమె బృందం తెలిపింది.
అయితే శనివారం మధ్యాహ్నం 12.30 తర్వాత నుంచి ఆమెతో ఎలాంటి కాంటాక్ట్ లేదని ఎంత ట్రై చేసిన ఆమెను సంప్రదించలేకపోయామని నటి నుస్రత్ భరుచ్చ (Nushrratt Bharuccha) బృదం వెల్లడించింది. దీంతో అందరు ఆందోళన చెందారు. కానీ తర్వాత ఆమె సురక్షితంగానే ఉన్నట్లు తెలిసింది. ఆమె బృందం తనకు ఎలాంటి హాని కలగకుండా సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కొన్ని భద్రత కారణాల దృష్ట్యా అన్ని వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని, ఆమె సురక్షితంగానే ఉందని తెలిపారు.
దీని పై భారత ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్పందిస్తూ ఇజ్రాయెల్ పై జరిగిన ఈ దాడి ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ఘటనలో నష్టపోయిన భాదిత కుటుంబాలకు ప్రధాని సానుభూతిని వ్యక్తం చేసారు. ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని తెలిపారు.