iPhone 15 series could launch on September 13 : యాపిల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐఫోన్-15 సిరీస్ లాంచ్ డేట్‌పై ఓ స్పష్టమైన క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం ఐఫోన్-15 లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 13న ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఇప్పటివరకు అఫిషియల్ అనౌన్స్మెంట్ రానప్పటికీ మరో కొన్ని రోజుల్లోనే దీనిపై ఓ ప్రకటన విడుదలయ్యే ఛాన్స్ ఉంది. డైనమిక్ ఐలాండ్ ఫీచర్‌తో వస్తున్న ఈ ఫోన్ కోసం యాపిల్ లవర్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లీకైనా ఫీచర్లు, ధరలను చూస్తూ మొబైల్ లాంచ్ అవ్వగానే కొనేందుకు రెడీ అవుతున్నారు.
ఐఫోన్-15, ఐఫోన్-15 సిరీస్‌లకు USB-C ఛార్జింగ్‌తో వస్తున్నట్టు ‘బ్లూమ్‌బర్గ్’ చెబుతోంది. ఇక ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ డిజైన్‌లో ఏ మార్పు ఉండకపోవచ్చు. 6.1 ఇంచెస్ డిస్ప్లే, 6.7 ఇంచెస్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది.
అయితే ఐఫోన్ 14 ప్రో మోడళ్లతో పోలిస్తే ఐఫోన్ 15 ప్రో వేరియంట్ల బెజెల్స్ పూర్తి భిన్నంగా, చాలా స్లిమ్‌గా ఉండవచ్చు. ఈ డిస్ప్లేలు కర్వడ్ ఎడ్జెస్‌తో స్మూత్ టచ్ ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఐఫోన్ 15 ప్రో, ప్రో మాక్స్ ఫోన్లు యాపిల్ నెక్ట్స్ జనరేషన్ A17 చిప్సెట్తో రానున్నాయి. ఈ ప్రాసెసర్, 3-నానోమీటర్ ప్రాసెస్‌లో మొట్ట మొదటి A-సిరీస్ యాపిల్ చిప్ కావడం విశేషం.
ఐఫోన్ 15 (iPhone series) ప్రారంభ ధర భారత్‌లో రూ. 80,000 ఉండవచ్చని అంచనా. ఈ సారి కొత్త చిప్ సెట్, కెమెరా అప్ గ్రేడ్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఐఫోన్ వస్తునట్టు సమాచారం. ఐఫోన్ 14 ప్రో సిరీస్ లాగానే ఐఫోన్ 15 వేరియంట్లు 48 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది. అదనంగా, పెద్ద కెమెరా మాడ్యూల్ హౌసింగ్ పెరిస్కోప్ లెన్స్‌లను ప్రదర్శిస్తుందని భావిస్తున్నారు. ఇది ఆకట్టుకునే 5-6x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో పాటు ఇతర సెన్సార్లతో కలిసి ఉంటుంది.
Also Read: మైండ్ బ్లాక్ ఆఫర్: ఎలక్ట్రిక్ స్కూటర్ రూ.59వేలకే.. రూ.11 వేల భారీ తగ్గింపు