New Criminal Laws 2024: మన దేశంలో మూడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇండియన్ పీనల్ కోడ్ (IPC), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (CrPC), 1872 నాటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ఈ కొత్త చట్టాలు తీసుకువచ్చారు. ఐపీసీ నిబంధనలలో పలు మార్పులు చేశారు. IPCలో ప్రతిపాదించబడిన ప్రధాన మార్పు ప్రకారం, కొత్త చట్టంలో IPC సెక్షన్ 377 తొలగించారు. ఇప్పుడు ఈ అంశంపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ మీడియాలో ఈ సెక్షన్ తొలగింపుపై నీరసం వ్యక్తం చేస్తూ పలు కథనాలు వెలువడ్డాయి. ది హిందూ పత్రిక ప్రకారం ఈ చట్టంలో పురుషులకు,ట్రాన్స్ జెండర్స్ కు రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడు కొత్తగా అమలులోకి వచ్చిన చట్టం ప్రకారం పురుషులతో అసహజ సెక్స్ నేరంగా పరిగణించరు. ప్రతిపాదిత చట్టం లైంగిక నేరాన్ని స్త్రీ లేదా బిడ్డపై అత్యాచారం వంటి నేరంగా నిర్వచించింది.
IPC సెక్షన్ 377 అంటే ఏమిటి?
IPC ప్రస్తుత నిబంధన ప్రకారం, పురుషులపై లైంగిక నేరాలు సెక్షన్ 377 పరిధిలోకి వస్తాయి. IPCలోని సెక్షన్ 377 ప్రకారం, ‘ప్రకృతి క్రమానికి విరుద్ధంగా ఎవరైనా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో సంభోగం చేస్తే, వారికి జీవిత ఖైదు లేదా పదేళ్ల వరకు పొడిగించగల జైలు శిక్ష విధిస్తారు. జరిమానా కూడా విధించవచ్చు.
New Criminal laws 2024: ఈ కొత్త చట్టాల నుండి సెక్షన్ 377 తొలగించారు. ఇప్పుడు పురుషులతో అసహజ సెక్స్‌కు శిక్ష లేదు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ కొత్త చట్టాల్లో ఐపీసీ నిబంధనలలో పలు మార్పులు చేశారు. IPCలో ప్రతిపాదించిన ప్రధాన మార్పు ప్రకారం, కొత్త చట్టంలో IPC సెక్షన్ 377 తొలగించారు. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పురుషులతో అసహజ సెక్స్ నేరంగా పరిగణించబడదు. ప్రతిపాదిత చట్టం లైంగిక నేరాన్ని స్త్రీ లేదా బిడ్డపై అత్యాచారం వంటి వాటిని మాత్రమే నేరంగా నిర్వచించింది.
ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఎవరైనా పురుషులు, ట్రాన్స్ జెండర్స్, జంతువులూ లైంగిక పరమైన నేరాలకు గురైతే ఎటువంటి శిక్షలు లేవు. ఇది నేరాలను పెంచుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. “BNS నుండి సెక్షన్ 377 తీసివేయడంతో అలాగే దీనికి ప్రత్యామ్నాయ చట్టం ఏదీ లేనందున, పురుషులు లేదా లింగమార్పిడి వ్యక్తులు అత్యాచారానికి వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణను కలిగి ఉండరు” అని ది హిందూ పత్రికలో అడ్వాకెట్ నండి తన అభిప్రాయాన్ని చెప్పారు. అటువంటి కేసుల్లో న్యాయం భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, సీనియర్ న్యాయవాది ఆనంద్ గ్రోవర్ “క్రిమినల్ చట్టాల నిర్మూలన” ముసుగులో, ప్రభుత్వం BNS బిల్లు నుండి సెక్షన్ 377 ను తొలగించిందని, ఇది నేరం రుజువైన తర్వాత శిక్ష తీవ్రతను తగ్గిస్తుంది.” అని హిందూకు వెల్లడించారు.
“భారతదేశంలో అత్యాచార చట్టాలు లింగ-తటస్థంగా లేవు. BNSలో సెక్షన్ 377ను చేర్చకపోవటంతో, జూలై 1 తర్వాత పురుషులు, లింగమార్పిడి వ్యక్తులపై అత్యాచారాలు నేరం కానివిగా మారతాయి” అని గ్రోవర్ అన్నారు.
మొత్తంగా చూసుకుంటే, కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాల్లో సెక్షన్ 377 తొలగించడం చిక్కులను రేకెత్తించేదిగానే కనిపిస్తోంది.
Also Read: మొబైల్ ఎగుమతుల్లో చైనా, వియత్నాం లను వెనక్కి నెట్టిన మేక్ ఇన్ ఇండియా ఫోన్లు