Best Investment Schemes For Women’s : నేటి ఆధునిక యుగంలో మహిళలు (Women’s) కూడా పురుషులతో భుజం భుజం కలిపి ముందుకు సాగుతున్నారు. ప్రయివేటు రంగం, వ్యాపారం, ప్రభుత్వం ఇలా అనేక చోట్ల పని చేస్తూ నేడు మహిళలు మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే దేశంలో చాలా మంది మహిళలకు ఆర్థిక అక్షరాస్యత లేదు. ఈ కారణంగా మహిళలకు తమ డబ్బును ఎక్కడ, ఎలా, ఏ పద్ధతిలో పెట్టుబడి పెట్టాలనే దానిపై సరైన అవగాహన లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో అద్భుతమైన పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో పెట్టుబడి (Investment Schemes) పెట్టడం ద్వారా మహిళలు చాలా మంచి రాబడిని పొందుతున్నారు. ఇక ఈ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా వారు వడ్డీ రేటులో రాయితీని కూడా పొందుతారు. ఈ క్రమంలో మహిళల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రారంభించిన ఆ అద్భుతమైన పథకాల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాం.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం: మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకం (Mahila Samman Savings Certificate Scheme) ప్రత్యేకంగా మహిళల కోసం ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మహిళలు 7.5 శాతం వడ్డీని పొందుతున్నారు. మీరు ఈ పథకంలో రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే, 7.5 శాతం వడ్డీ రేటు ఆధారంగా, రెండేళ్ల తర్వాత మెచ్యూరిటీ సమయంలో మీరు రూ. 2,32,044 పొందుతారు. మహిళలు మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనలో గరిష్టంగా రెండేళ్ల వరకు పెట్టుబడి పెట్టవచ్చు.
సుకన్య సమృద్ధి యోజన : ముఖ్యంగా ఆడపిల్లల భవిష్యత్తును కాపాడేందుకు సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana) ను ప్రారంభించారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటును పొందుతున్నారు. మీ కుమార్తె వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే, మీరు సమీపంలోని పోస్టాఫీసును సందర్శించడం ద్వారా ఈ పథకం కింద మీ కుమార్తె ఖాతాను తెరవవచ్చు.
ఎల్ఐసి ఆదర్షి :
ఎల్ఐసీ ఆధార్శిల పథకం (LIC Aadhaar Shila Scheme) మహిళల కోసం అమలు చేస్తున్న గొప్ప పథకం. ఇది నాన్-లింక్డ్ వ్యక్తిగత జీవిత బీమా పథకం. 8 సంవత్సరాల బాలికల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఎల్ఐసీ ఆధార్శిల పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన తర్వాత, మీరు మెచ్యూరిటీ సమయంలో నిర్ణీత మొత్తాన్ని పొందుతారు.