World Hindi Day: ఈరోజు జనవరి 10. ప్రపంచవ్యాప్తంగా హిందీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 60కోట్ల మంది హిందీ మాట్లాడతారు. ఇది ఇండో ఆర్యన్ భాష. దేవనాగరి ఈహిందీ భాష లిపి. ఇంగ్లీష్, మాండరిన్ తర్వాత ప్రపంచంలో ఎక్కువ మంది మాట్లాడేది హింది భాషనే.
ప్రతి సంవత్సరం, జనవరి 10వ తేదీని ప్రపంచవ్యాప్తంగా హిందీ దినోత్సవం(World Hindi Day)గా జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం ప్రపంచవ్యాప్తంగా హిందీని ప్రచారం చేయడం. దీంతో పాటు భారతీయ సంస్కృతి(Indian culture)ని ఇతర దేశాలకు తీసుకెళ్లాలి. దీనిని మొదటిసారిగా 2006 సంవత్సరంలో అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Dr. Manmohan Singh)జరుపుకున్నారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అంతర్జాతీయ హిందీ దినోత్సవాన్ని(International Hindi Day) జనవరి 10న జరుపుకుంటే, జాతీయ హిందీ దినోత్సవా(National Hindi Day)న్ని సెప్టెంబర్ 14న జరుపుకుంటారు. భారతదేశంలోనే కాదు, ఫిలిప్పీన్స్, మారిషస్ , నేపాల్, సురినామ్, ఫిజీ, టిబెట్, ట్రినిడాడ్, పాకిస్తాన్లలో కూడా హిందీ మాట్లాడతారు . ప్రపంచవ్యాప్తంగా మాట్లాడే భారతీయ ప్రజలను ఏకం చేసే రోజు ఇది.
122 భాషలు:
2001 సెన్సస్ తెలిపిన వివరాల ప్రకారం మన దేశంలో 122 ప్రధాన భాషలు, 1599 ఇతర భాషలు మనుగడలో ఉన్నాయి. దేవనాగరి లిపిలోని హిందీ కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగాఉంది. అయితే చాలా మంది భావిస్తున్నట్లు హిందీ మన జాతీయ భాష కాదు. భారత రాజ్యాంగం ఏ భాషకు కూడా జాతీయ భాష హోదా ఇవ్వలేదు.
ప్రపంచ హిందీ దినోత్సవం చరిత్ర:
మొదటి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని 1975 జనవరి 10న నాగర్‌పూర్‌లో జరుపుకున్నారు. ఇందులో 30 దేశాల నుండి 122 మంది ప్రతినిధులు పాల్గొన్నారు, అయితే ప్రపంచ హిందీ దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకుంటున్నట్లు 2006 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.
ప్రపంచ హిందీ దినోత్సవాన్ని జరుపుకోవడం యొక్క ఉద్దేశ్యం:
హిందీ భాషను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించబడింది. ఈ రోజును భారత రాయబార కార్యాలయాల నుండి వైభవంగా, ప్రదర్శనతో జరుపుకుంటారు. హిందీ భాషకు సంబంధించి వివిధ రకాల కార్యక్రమాలు, పోటీలు నిర్వహించబడతాయి. ప్రపంచ హిందీ సెక్రటేరియట్ మారిషస్‌లో ఉంది.
ప్రపంచ హిందీ దినోత్సవం 2024 థీమ్:
ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో జరుపుకుంటారు. దీనికి సంబంధించిన వర్క్ కేవలం థీమ్ కింద మాత్రమే జరుగుతుంది. 2024వ సంవత్సరంలో హిందీ దినోత్సవం యొక్క థీమ్ ‘సాంప్రదాయ జ్ఞానం నుండి కృత్రిమ మేధస్సు వరకు హిందీ’. దీనికి సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటారు.
Also read: చిన్న పుట్టగొడుగులు…పెద్ద వ్యాధులకు గుడ్ బై చెబుతాయ్..చలికాలంలో రోజూ తింటే ఎన్ని లాభాలో..!!