INDIA VS NETHERLANDS: రోహిత్ శర్మ(Rohit Sharma) సిక్స్‌లు కొడుతుంటే టీమిండియా అభిమానులకు వచ్చే ఆనందం ఎంత ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. సిక్సులు కొట్టడం ఇంత ఈజీనా అని అనుమానం వచ్చేలా సిక్సులు బాదుతుంటాడు రోహిత్ శర్మ. ఇప్పటికే సిక్సులు పరంగా విండీస్ రారాజు క్రిస్ గేల్ రికార్డులను బద్దలు కొట్టిన రోహిత్ మరో ఫీట్ సాధించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లండ్స్పై భారత్ తలపడుతోంది. టాస్ గెలిచిన ఇండియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. వరల్డ్‌కప్ గ్రూప్ స్టేజీలో ఇదే చివరి మ్యాచ్. టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఎప్పుడో కన్ఫామ్ చేసుకోగా.. ఈ మ్యాచ్‌లోనూ భారత్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగింది. అక్కర్ మ్యాన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన రోహిత్ కొత్త రికార్డు ఏంటో తెలుసుకోండి.
𝗛𝗜𝗧𝗠𝗔𝗡 𝗦𝗣𝗘𝗖𝗜𝗔𝗟!
Captain Rohit Sharma now holds the record for the most ODI sixes in the calendar year 💥#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvNED pic.twitter.com/YTCYHAKk7B
— BCCI (@BCCI) November 12, 2023
ఏబీడీ రికార్డు గల్లంతు:
ఇప్పటివరకు క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సులు కొట్టిన రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీడీ పేరిట ఉంది. క్యాలెండర్ ఇయర్లో ఏబీడీ 58 సిక్సులు కొట్టగా.. ఇప్పుడా రికార్డును హిట్‌మ్యాన్ లేపేశాడు. ఈ క్యాలెండర్ ఇయర్లో హిట్ మ్యాన్ ఇప్పటివరకు 59 సిక్సులు కొట్టాడు. 2015లో ఏబీడీ ఈ రికార్డు సెట్ చేయగా.. 8ఏళ్లకు అతని రికార్డు బ్రేక్ అయ్యింది. ఇక ఏబీడీ తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు. 2019 క్యాలెండర్ ఇయర్లో గేల్ 56 సిక్సులు బాదాడు.
ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక వన్డే సిక్సర్లు:
59* – 2023లో రోహిత్ శర్మ*
58 – 2015లో ఏబీడీ డివిలియర్స్
56 – 2019లో క్రిస్ గేల్
కెప్టెన్‌గానూ అదిరే రికార్డు:
ఇక అక్కర్‌మ్యాన్ బౌలింగ్‌లో సిక్సర్ ద్వారా రోహిత్ ఖాతాలో మరో రికార్డు వచ్చి పడింది. సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన సిక్సర్ల జాబితాలో రోహిత్ ఫస్ట్ ప్లేస్‌కు వచ్చాడు. ఈ వరల్డ్‌కప్‌లో రోహిత్ ఇప్పటివరకు 23 సిక్సలు కొట్టాడు. 2019 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ మోర్గాన్ 22 సిక్సులు బాదాడు. ఇప్పుడా రికార్డు చెరిగిపోయింది.
ఒకే వరల్డ్‌కప్‌లో కెప్టెన్ బాదిన అత్యధిక సిక్సర్లు
23* – 2023లో రోహిత్ శర్మ*
22 – 2019లో ఇయాన్ మోర్గాన్
21 – 2015లో ఏబీ డివిలియర్స్
18 – 2019లో ఆరోన్ ఫించ్
17 – 2015లో బి మెకల్లమ్
Also Read: ఒక్క బంతికి 286 రన్స్.. ఈ మేటర్ తెలుసుకుంటే పిచ్చెక్కిపోద్ది భయ్యా!
WATCH: