Bumrah ODI Stats in Asia: ఆసియా పిచ్‌లు ఎక్కువగా స్పిన్ ట్రాక్‌లు.. లేకపోతే థార్ రోడ్డులాంటి ఫ్లాట్ ట్రాక్‌లు. ఉపఖండం పిచ్‌లపై బౌలర్లుకు తిప్పలు తప్పవు.. ముఖ్యంగా పేసర్లకు ఇక్కడ పిచ్‌లపై లైఫే దొరకదు. ఎంత తెలివిగా బౌలింగ్ వేసినా పరుగులు పిండుకునే బ్యాటర్లు ఉంటారు. పిచ్‌లు అలా ఉంటాయి మరి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో వేరు.. మన దగ్గర వేరు. అయితే గ్రౌండ్ ఏదైనా.. బ్యాటర్ ఏవరైనా.. పిచ్‌పై బౌలర్లకు జీవమే లేకున్నా.. పరిణితితో బంతులు వేసి వికెట్లు పడగొట్టే ఆటగాళ్లు ఉంటారు. అలాంటి చాలా కొద్ది మంది బౌలర్లలో టీమిండియా యార్కర్ కింగ్ బుమ్రా(jasprit bumrah) ఒకడు. ఇటివలే గాయం నుంచి కోలుకోని ఐర్లాండ్‌పై తాజాగా జరిగిన టీ20 మ్యాచ్‌లో అటు కెప్టెన్‌గా ఇటు బౌలర్‌గా మెరిసిన బుమ్రా గురించి కొన్ని ఆసక్తికర స్టాట్స్ సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Jasprit Bumrah is back….!!!!
India cricket is back, Indian cricket fans are happy.
A champion in this generation. pic.twitter.com/0oOlGlSevl
— Johns. (@CricCrazyJohns) August 18, 2023
ఆసియాలో 65 వన్డే వికెట్లు:
➡ 121 వన్డే వికెట్లలో బుమ్రాకు 63 వికెట్లు ఆసియా గడ్డపైనే వచ్చాయి. అది కూడా కేవలం 37 మ్యాచ్‌ల్లోనే.0
➡ జనవరి 2016లో బుమ్రా వన్డే అరంగేట్రం చేసిన తర్వాత ఉపఖండంలో మరే ఇతర పేసర్ కూడా ఇన్ని వికెట్లు తీయలేదు.
➡ బంగ్లాదేశ్(bangladesh)కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్ 57 వికెట్లతో రెండోస్థానంలో ఉన్నాడు
➡ ఆసియా పిచ్‌లపై బుమ్రాకు అద్భుతమైన ఎకానమీ ఉంది- 4.65
భారత పేసర్లలో అత్యుత్తమ సగటు:
• ఉపఖండంలో 50 లేదా అంతకంటే ఎక్కువ వన్డే వికెట్లు సాధించిన భారత పేసర్లలో బుమ్రా ఒకడు.. అతని బౌలింగ్ యావరేజ్- 23.95
• టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రస్తుత భారత పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ (27.43) ఈ జాబితాలో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.
• ప్రస్తుత పేసర్లలో ముస్తాఫిజుర్ (21.51) మాత్రమే బుమ్రా కంటే ముందున్నాడు.
వివిధ దేశాలలో బుమ్రా గణాంకాలు:
➼ శ్రీలంకలో ఐదు వన్డేలు ఆడిన బుమ్రా 15 వికెట్లు తీశాడు. 3.90 ఎకానమీతో అదిరిపోయే బౌలింగ్ వేశాడు. ఇందులో ఒక ఫైఫర్(ఐదు వికెట్లు) కూడా ఉంది.
➼ భారత్ గడ్డపై 28 వన్డేల్లో 40 వికెట్లు తీశాడు బుమ్రా. ఎకానమీ 4.93
➼ UAEలో నాలుగు ODIల్లో ఎనిమిది వికెట్లు తీశాడు. ఎకానమీ 3.67
ఇక 29 ఏళ్ల బుమ్రా గాయం కారణంగా ఏడాదికిపైగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం ఐర్లాండ్(ireland)తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వడమే కాకుండా.. ఫస్ట్ మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు ఈ స్పీడ్ స్టార్.
Also Read: ఈ కుర్రాడిని సానపెడితే మరో యువరాజ్, ధోనీ అవుతాడు భయ్యా! రాసి పెట్టుకోండి!