Asian Games Volleyball 2023: ఆసియా క్రీడలు 2023లో భారత పురుషుల వాలీబాల్ జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఆ జట్టు తన తొలి మ్యాచ్‌లో 3-0తో కంబోడియాను ఓడించింది. ఇప్పుడు చివరి రన్నరప్ దక్షిణ కొరియాను (South Korea) ఓడించి భారత వాలీబాల్ జట్టు (Indian Volleyball Team) సంచలనాన్ని సృష్టించింది. దక్షిణ కొరియాపై భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేసి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేశారు.
భారత్ విజయం సాధించింది :
ఉత్కంఠభరితమైన ఐదు సెట్ల మ్యాచ్‌లో దక్షిణ కొరియాను ఓడించి భారత పురుషుల వాలీబాల్ జట్టు అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనితో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి ఆసియా గేమ్స్‌లో నాకౌట్ రౌండ్‌కు చేరుకుంది. గ్రూప్ సి చివరి మ్యాచ్‌లో భారత జట్టు రెండు గంటల 38 నిమిషాల్లో 3-2 (25-27 29-27 25-22 20-25 17-15)తో కొరియాను ఓడించింది. వాలీబాల్‌లో దక్షిణ కొరియా మూడు బంగారు పతకాలు సాధించింది. అదే సమయంలో గత పదేళ్లలో కొరియా జట్టుపై భారత్‌కు ఇదే తొలి విజయం. ప్రస్తుతం భారత్ ర్యాంకింగ్ 73వ స్థానంలో ఉండగా, దక్షిణ కొరియా జట్టు 27వ స్థానంలో ఉంది.
A BIG DAY for the 🇮🇳 Men’s Volleyball Team at #AsianGames 🥳
Team 🇮🇳 triumphs over 🇰🇷 with a thrilling 3-2 victory! 🙌 This win marks India’s second triumph in the tournament.
Way to go, Team🥳👏 You have done #HallaBol right 👍
#Cheer4India#JeetegaBharat#BharatAtAG22 pic.twitter.com/WHK1Cui6ax
— SAI Media (@Media_SAI) September 20, 2023
గ్రూప్ సిలో భారత్ అగ్రస్థానం:
తొలి మ్యాచ్‌లో కంబోడియాపై 3-0తో, రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 3-2తో భారత్ విజయం సాధించింది. ఈ కారణంగా ఐదు పాయింట్లతో గ్రూప్‌లో భారత్ అగ్రస్థానంలో ఉంది . గ్రూప్ సిలో దక్షిణ కొరియా జట్టు ఒక పాయింట్‌తో రెండో స్థానంలో ఉంది. కొరియాపై భారత జట్టులో అమిత్ గులియా, అశ్వల్ రాయ్ అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు ముఖ్యమైన పాయింట్లు సాధించారు. భారత్ తదుపరి రౌండ్లో చైనీస్ తైపీ లేదా మంగోలియాతో తలపడనుంది.
ఇది కూడా చదవండి: నిజ్జర్ కేసులో ఒంటరైన కెనడా..భారత్ పై ఆరోపణలను ఖండించిన చైనా..!!
గత సీజన్లో ఆ జట్టు 12వ స్థానంలో:
1986లో భారత్ చివరిసారిగా ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించింది. అంతకుముందు 1962లో రజతం, 1958లో కాంస్యం సాధించింది. ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు వాలీబాల్‌లో మొత్తం మూడు పతకాలు సాధించింది. ఇండోనేషియాలోని జకార్తాలో గత సీజన్లో భారత వాలీబాల్ జట్టు 12వ స్థానంలో నిలిచింది.