కెనడా, భారత్ మధ్య పరిస్థితులు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. న్యూఢిల్లీలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని వెంటనే పిలుచుకోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. మీ దౌత్యసిబ్బంది భారత్ లో ఒక్క క్షణం కూడా ఉండేందుకు వీల్లేదని వార్నింగ్ ఇచ్చింది. అక్టోబర్ 10 నాటికి గడువును విధించింది భారత్. ఇరు దేశాల్లో సమాన దౌత్య అధికారులు ఉండాన్న నియమంపై భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాను కోరిన సంగతి తెలిసిందే.
కాగా ప్రస్తుతం ఢిల్లీలో 62మంది కెనడా దౌత్య అధికారులు ఉంటున్నారు. ఆ సంఖ్యను ఇప్పుడు 41కి తగ్గించుకోవాలని కేంద్రం అల్టిమేటం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అక్టోబర్ 10వ తేదీ తర్వాత ఇంకా ఎక్కువ మంది దౌత్య అధికారులు ఉన్నట్లయితే…వారికి ఎలాంటి భద్రతను ఇవ్వబోమని కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. అయితే ఈ వార్తలపై కేంద్రంగానీ, విదేశాంగ శాఖకానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ వార్తను ఫైనాన్సియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది.
ఇది కూడా చదవండి: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థా అరెస్ట్
అటు కెనడా-భారత్ మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఖలిస్తానికి చెందని మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టు హర్దిప్ సింగ్ నిజ్జర్ కెనడాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం ఈ వివాదానికి కారణమైంది. ఈ కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్ ను కెనడా డిమాండ్ చేయడంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తూ భారత్ పై నిందలు వేయడం సరికాదంటూ కెనడాకు చివాట్లు పెడుతూ మండిపడింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఆంక్షలు నెలకొన్నాయి. ఆ తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మున్ముందు కెనడా భారత్ పట్ల ఇంకెంత కఠినంగా వ్యవహారిస్తుందో చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు అలర్ట్..450 పోస్టుల దరఖాస్తుకు నేడే చివరి తేదీ..!!