Modi on Manipur Violence: స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day) సందర్భంగా ఎర్రకోటపై (Red Fort) నుంచి దేశప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధాని తన ప్రసంగంలో మణిపూర్ (Manipur) హింసను కూడా ప్రస్తావించారు. దేశం మణిపూర్ ప్రజల వెంటే ఉందని మోదీ అన్నారు. శాంతి ద్వారానే పరిష్కార మార్గం దొరుకుతుందని మోదీ అన్నారు. సమస్య పరిష్కారానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని, ఇది కొనసాగుతుందన్నారు.
ప్రధాని మోదీ ఇంకా మాట్లాడుతూ, ‘గత కొన్ని వారాలుగా, మణిపూర్ తోపాటు భారతదేశంలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. తల్లులు, కుమార్తెల గౌరవంతో ఆడుకున్నారు, కొన్ని రోజులు శాంతిభద్రతల నివేదికలు ఉన్నాయి. దేశం మొత్తం కూగా మణిపూర్ ప్రజలతో ఉంది అని మోదీ అన్నారు.
భారత స్వాతంత్ర్య పోరాటానికి సహకరించిన వీరందరికి నేను నివాళులు అర్పిస్తున్నాను అని ప్రధాని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం.. ఇప్పుడు జనాభా పరంగా కూడా అగ్రగామి దేశం అన్నారు. ఇంత పెద్ద దేశం, నా కుటుంబంలోని 140 కోట్ల మంది సభ్యులు ఈరోజు స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో తమ వంతు సహకారం అందించిన ధైర్యవంతులందరికీ ఇవే నా నివాళులు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | PM Modi appeals for peace in Manipur from the ramparts of the Red Fort on 77th Independence Day
"The country stands with the people of Manipur…Resolution can be found through peace only. The Centre and the State government is making all efforts to find resolution." pic.twitter.com/TbQr0iopY6
— ANI (@ANI) August 15, 2023
ఈసారి ప్రకృతి వైపరీత్యం దేశంలోని అనేక ప్రాంతాల్లో ఊహించలేని దుస్థితిని సృష్టించింది. ఈ సంక్షోభాన్ని చవిచూసిన కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వం కలిసి ఆ సంక్షోభాలన్నింటి నుంచి విముక్తి పొంది సత్వర అభివృద్ధి దిశగా పయనిస్తుందని నేను హామీ ఇస్తున్నాను అని మోదీ అన్నారు.
ప్రపంచంలోని మొదటి మూడు స్టార్టప్ ఎకోసిస్టమ్‌లలో నేడు యువత భారత్‌కు స్థానం కల్పించారని ప్రధాని మోదీ అన్నారు. దేశంలో అవకాశాలకు కొదవ లేదని, అవసరమైనన్ని అవకాశాలు లభిస్తాయని అన్నారు. మీరు ప్రయత్నాలు చేయండి, ప్రభుత్వం మీకు అవకాశాలను అందిస్తుంది. మనకు ప్రజాస్వామ్యం, జనాభా, వైవిధ్యం ఉందని, భారతదేశం యొక్క ప్రతి కలను నిజం చేసే సామర్థ్యం ఈ త్రివేణికి ఉందని ప్రధాని మోదీ అన్నారు.
Also Read: ఇండిపెండెన్స్ డే స్పెషల్…ఇండియన్ టెక్స్టైల్ క్రాఫ్ట్స్‌తో గూగుల్ డూడుల్..!!