Ilayaraja: టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. దిగ్గజ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా కుమార్తె, గాయని భవతారిణి ఆకస్మిక మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయుర్వేద వైద్యం కోసం ఆమెను శ్రీలంకకు తీసుకెళ్లగా, క్యాన్సర్ తో పోరాడుతూ గురువారం సాయంత్రం ఆమె అక్కడే కన్నుమూశారు.
ఇది కూడా చదవండి: తెలుగుతల్లి ఫ్లై ఓవర్పై కారులొ మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్
భవతారిణి ఆకస్మిక మృతి ఇళయరాజా కుటుంబీకులతో పాటు అభిమానులను తీవ్రంగా కలచివేసింది. ఆమె వయసు 47 ఏళ్లు. ఆమె మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తంచేశారు. దాదాపు 30కి పైగా చిత్రాల్లో పాటలు పాడిన ఆమె మంచి గాయనిగా పేరు తెచ్చుకున్నారు. ఇళయరాజా సంగీతం అందించిన రాసయ్య చిత్రంతో ఆమె గాయనిగా వెండితెరకు పరిచయమయ్యారు.
Sad news! Isaignani Ilayaraja ‘s daughter Singer #Bhavatharini passed away in Srilanka this evening..
She was getting treated for cancer..
Shocking to hear..
May her soul RIP! pic.twitter.com/dyJswODcfv
— Ramesh Bala (@rameshlaus) January 25, 2024
గుండెల్లో గోదారి సినిమాలో తెలుగులో కూడా ఓ పాట పాడి అభిమానులను ఆకట్టుకున్నారు. 2000 సంవత్సరంలో విడుదలైన భారతి సినిమాలో ‘మైల పోల పొన్ను ఒన్ను’ పాటకు ఆమె నేపథ్య గాయనిగా జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. గాయనిగా మాత్రమే కాకుండా.. అనేక సినిమాలకు సంగీత దర్శకురాలిగా కూడా ఆమె పనిచేశారు. శుక్రవారం ఆమె పార్థివ దేహాన్ని చెన్నైకి తరలించి అక్కడే ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.