Nirmala Sitharaman Says About Taxes : పన్నులపై ప్రజలు ప్రశ్నించడం తనకు కూడా ఇష్టం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) అన్నారు. భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) 11వ స్నాతకోత్సవంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ, ‘ఇన్ని పన్నులు ఎందుకు అని ప్రజలు అడగడం నాకు ఇష్టం లేదు. నేను పన్నులను సున్నాకి తీసుకురావాలనుకుంటున్నాను, కానీ దేశం ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. అందుకు నిధులు కావాలి. మన దేశంలో- అంతర్జాతీయ స్థాయిలో మనకు చాలా కట్టుబాట్లు ఉన్నాయి. మన అవసరాలు తీర్చడానికి ఎవరో డబ్బు మనకు డబ్బు ఇస్తారని మనం ఎదురు చూడలేము. కాబట్టి మనమే ఖర్చు చేస్తున్నాము. అందుకు చాలా డబ్బు కావాలి.’’ అని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లో అకడమిక్ భవనం, లెక్చర్ హాల్‌కు ఆర్థిక మంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే 442 మంది పరిశోధకులకు పట్టాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ఆర్థిక మంత్రి ప్రసంగంలో ముఖ్యవిషయాలు ఇవే..
భారతీయ సంప్రదాయాలు బనారస్ నుండి కేరళ వరకు..
చైనా విద్యార్థులు భారతదేశంలో చదువుకోవడానికి వస్తున్నారు. సమాజంలో మీరు సంపాదించిన జ్ఞానాన్ని పంచుకున్నప్పుడే సమాజం మీ జ్ఞానంతో ప్రయోజనం పొందుతుంది. ఈ సంస్థలో చాలా మంది విద్యార్థులు కేరళ, బెంగాల్‌కు చెందినవారున్నారు. IISER 3 వేల పేపర్లను ప్రచురించింది. దేశవ్యాప్తంగా ర్యాంకింగ్ కూడా బాగుంది. ఇక్కడి విద్యార్థుల కృషి వల్ల 8 నుంచి 9 పేటెంట్లు ఉన్నాయి. కేరళ, బెంగాల్ విద్యార్థులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. ఆదిశంకరాచార్య కేరళ నుండి వచ్చారు. రాష్ట్రంలోని విద్యార్థులు విజ్ఞానంతో ముందుకు సాగుతున్నారు. బనారస్‌కు భిన్నమైన జ్ఞానం ఉంది. బనారస్ నుండి కేరళ వరకు భారతీయ సంప్రదాయం ఉంది.
ఇక్కడ నుంచి డిగ్రీ చదివి ఎక్కడో ఉద్యోగం చేసినా, బహుశా మీకు అవసరమైన, సైన్స్‌పై పని చేయడానికి సమయం దొరకడం కష్టం కాదని ఆర్థిక మంత్రి యూనివర్సిటీ విద్యార్థులతో అన్నారు.
డేటా సైన్స్ రంగంలో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది..
నిర్మలా సీతారామన్ కొత్త టెక్నాలజీతో పరిశోధనలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. డేటా సైన్స్ (Data Science) రంగంలో మరిన్ని పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. 4జీ నెట్వర్క్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. నేడు, 5G కారణంగా, దేశవ్యాప్తంగా మంచి కనెక్టివిటీ ఉంది. భారతదేశం ఇప్పుడు అధునాతన రసాయన శాస్త్రంతో పని చేస్తోంది. పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత అవకాశం ఉంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను నిల్వ చేసుకోవచ్చు. థర్మల్ పవర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. పనితో పాటు సైన్స్‌లో కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు.
Also Read : బాక్సింగ్ కే జీవితం అంకితమిచ్చా..ఓటమి తట్టుకోలేకపోతున్నాను!