Hyper aadhi: పవన్ కళ్యాణ్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని అందుకే ఆయన వెంట ఉన్నానని హైపర్ ఆది అన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ప్రభుత్వాలు చేయాల్సిన పనిని ఆయన చేస్తున్నారన్నారు. విశాఖలో బోట్లు తగలబడినప్పుడు మత్స్యకారులు ఆదుకునే విషయంలో కానీ, కౌలు రైతులను ఆదుకునే విషయంలో పవన్ చూపించిన చొరవ తనకు నచ్చిందని అన్నారు.
Also Read: నేడు ముఖేశ్ అంబానీ బర్త్ డే.. ఆయన లైఫ్ సీక్రెట్స్ గురించి మీకు తెలుసా!
వృత్తిపరంగా సినీ ఇండస్ట్రీలో హైదరాబాదులో ఉన్నప్పటికీ ఆంధ్రను అభివృద్ధి చేయాలని ఈ విషయంలో పవన్ కళ్యాణ్ వెంట ఉన్నామని ఆది అన్నారు. నీతి నిజాయితీ కలిగిన వ్యక్తి అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణు అని.. అందుకే పవన్ కళ్యాణ్ ఆయనకు సీటు ఇచ్చారని పేర్కొన్నారు. అనకాపల్లిలో గడిచిన రెండు రోజుల ప్రచారంలో జనసేనకు విశేష స్పందన లభించిందన్నారు.