Independence day Hyderabad Metro Super Saver Offer: సందర్భానికి తగ్గట్టుగా.. పండుగల సమయంలో..వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులకు దగ్గరయ్యే హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) మరో అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ ఇప్పటికే మొదలైపోయింది కూడా. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రయాణికులకు బంపర్ ఆఫర్(Independence Day Offer) ఇచ్చింది. కేవలం 59 రూపాయలకే నగరాన్ని చుట్టేసే ఆఫర్‌ని రన్ చేస్తోంది. ఈ ఆఫర్ ఇవాళ (ఆగస్టు 12), రేపు (ఆగస్టు 13)తో పాటు ఆగస్టు 15న అందుబాటులో ఉంటుంది. దీనికి ఫ్రీడమ్ ఆఫర్ అని పేరు పెట్టింది. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర జరిగిన కస్టమర్ లాయల్టీ ప్రోగ్రామ్ ఈవెంట్లో ఈ ఆఫర్‌ని ప్రారంభించారు మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి.
Embark on a journey of freedom with Hyderabad Metro!
Celebrate the spirit of Independence as you glide through the cityscape in style.Hyderabad Metro has unveiled an exciting offer for passengers today, the ‘Super Saver Freedom Offer’ by Mr KVB Reddy, MD & CEO – LTMRHL during a… pic.twitter.com/qcNTiBZ1UH
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) August 11, 2023
సూపర్ డూపర్ సేవర్:
ఈ సూపర్ సేవర్ ఫ్రీడం ఆఫర్ ప్రకారం ఆగస్టు 12, 13, 15 తేదీల్లో హైదరాబాద్‌లోని అన్ని మెట్రో రైళ్లలో ప్రయాణికులు రూ.59ల రీఛార్జ్‌తో తిరగొచ్చు. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ఎక్కడా పరిమితులు లేవు. సాధారణంగా.. సూపర్ సేవర్ హాలిడే కార్డులో భాగంగా ఈ ఛార్జి రూ.99 ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫర్ కింద దీన్ని రూ.59కి తగ్గించారు. ఈ ఆఫర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, హైదరాబాద్ మెట్రో రైలు సౌలభ్యం, సామర్థ్యాన్ని ఆస్వాదించాలని కేవీబీ రెడ్డి ప్రతి ఒక్కరికీ కోరుతున్నారు. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ప్రయాణికులకు కొత్త అనుభుతిని మిగుల్చుతుందని చెబుతున్నారు. తమకు ప్రజల పట్ల ఏ విధమైన వైఖరి ఉందో చెప్పడానికి ఈ ఆఫర్ నిదర్శనంగా నిలుస్తుందని హైదరాబాద్ మెట్రో రైల్ తెలిపింది.
మెట్రో రైలు ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ ” మా విలువైన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన SSF ఆఫర్‌ని అందించడానికి మేము సంతోషిస్తున్నాము. ఈ ఆఫర్ ప్రయాణాన్ని సరసమైనదిగా చేయడమే కాకుండా మన నగరాన్ని ఉత్సాహవంతంగా మార్చాలనే మా దృష్టితో ప్రతిధ్వనిస్తుంది. ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలని.. హైదరాబాద్ మెట్రో రైలు సౌలభ్యం, సామర్థ్యాన్ని అనుభవించాలని మేము ప్రతి ఒక్కరినీ ఆహ్వానిస్తున్నాము’ అని చెప్పారు కేవీబీ రెడ్డి. సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ ఈ నెల 12, 13, 15 తేదీల్లో అందుబాటులో ఉంది. ఆగస్టు 14న ఈ ఆఫర్ అందుబాటులో లేదని ప్రయాణికులు గుర్తుపెట్టుకోవాలి. ఈ నాలుగు రోజుల్లో మూడు రోజుల పాటు కేవలం నామమాత్రపు ధరతో ప్రయాణికులు అపరిమిత మెట్రో ప్రయాణాల్లో ఆనందించవచ్చు. రూ.59 సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డ్‌ని రీలోడ్ చేయడం ద్వారా ఈ డీల్‌ని యాక్సెస్ చేయవచ్చు.
Also Read: గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?