వరల్డ్‌కప్ హోస్ట్ చేస్తున్నామంటే ఎంతో హూందాగా అనిపించాలి. అందులో మనది క్రికెట్ పిచ్చి దేశం. పైగా మన క్రికెట్ బోర్డు ప్రపంచంలో ధనిక బోర్డు. బీసీసీఐ దగ్గర ఉన్న డబ్బులు ఐసీసీ(ICC) దగ్గర కూడా లేవు. ప్రపంచంలో దాదాపు అన్ని క్రికెట్ బోర్డును శాసిస్తున్న సత్తా మనది. అయితే బీసీసీఐ నిర్లక్ష్యం ఇండియా ప్రతిష్టను అభాసుపాలు చేస్తోంది. మొన్న వరల్డ్ హయ్యస్ట్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆహ్మదాబాద్ క్రికెట్ స్టేడియంలో కూర్చిలపై కాకి రెట్లను చూసి విస్తూపోయిన అభిమానులు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలోని సీట్లను చూసి నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. ఎందుకంటే మన స్టేడియంలోనూ అదే పరిస్థితి చాలా సీట్లలో పక్షల రెట్టలు దర్శనమిస్తున్నాయి. ఇది ఫొటోలు తీసిన ఓ క్రికెట్ ఫ్యాన్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.
View this post on Instagram
ఇది ఫేక్ కాదు రియలే:
అక్టోబర్ 3న పాకిస్థాన్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు హాజరైన క్రికెట్ విశ్లేషకుడు, కామెంటేటర్ సీ.వెంకటేశ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ ఫొటోలు తీవ్ర దుమారం రేపాయి. ఇవి పాతవని కొంతమంది వాదించగా.. వెంకటేశ్ మాత్రం ఫ్రూఫ్స్‌లో పోస్ట్ చేశారు. లైవ్‌గా ఫొటోను పోస్ట్ చేశారు. టికెట్‌తో సహా ఫొటోను ట్వీట్ చేశారు. దీనికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లేదా బీసీసీఐ నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇక ఆహ్మాదాబాద్‌లో జరిగిన మొదటి మ్యాచ్‌లోనూ మోదీ స్టేడియంలో ఈ తరహా దృశ్యాలే కనిపించాయి. అక్కడ కూడా స్టేడియం గ్యాలరీల్లో కాకి రెట్టలు దర్శనమిచ్చాయి.
This is for those, who said I had posted an old or fake pic. I’m very present at the ground. pic.twitter.com/klMfNCM6VM
— C.VENKATESH (@C4CRICVENKATESH) October 3, 2023
వీడియో ఫ్రూఫ్‌తో సహా:
వెంకటేశ్ పెట్టిన ఫొటోలు ఫేక్ అని కొంతమంది వితండవాదం చేయగా.. ఆయన ఏకంగా వీడియో పోస్ట్ చేశారు వెస్ట్రన్ టెర్రస్‌లో ఈ తరహా సీట్లు ఉన్నట్టు చూపించారు. ‘ఉప్పల్ స్టేడియంలోని కొన్ని స్టాండ్లలో సీట్ల దుస్థితిపై నేను చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. దేశం వెలుపల కొందరు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. స్టేడియాన్ని సరికొత్త సీట్లతో పునరుద్ధరించారని, వెస్ట్రన్ టెర్రస్ స్టాండ్స్ మాత్రమే పాత సీట్లు అధ్వాన్నంగా ఉన్నాయని స్పష్టం చేయాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. అంటే మిగిలిన దేశాల అభిమానులు బీసీసీఐపై నెగిటివ్ కామెంట్స్ చేయగా.. వెంకటేశ్ ఈ తరహా ట్వీట్‌తో రిప్లై ఇచ్చాడు.
This video is for those doubting thomoses who felt my earlier pics were edited. pic.twitter.com/xmC5ti9hCm
— C.VENKATESH (@C4CRICVENKATESH) October 3, 2023
ALSO READ: ఆ తోపు లేకుండానే బరిలోకి టీమిండియా.. అయినా ఆస్ట్రేలియాకు బడితపూజే..!