High Tension In Allagadda : ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి, టీడీపీ(TDP) నేత భూమా అఖిల ప్రియ(Bhuma Akhila Priya) బాడీ గార్డ్ నిఖిల్(Body Guard Nikhil) పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయ పరిచారు. మంగళవారం రాత్రి అఖిల ప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా.. దుండగులు వాహనంతో అతి వేగంగా వచ్చి ఢీకొట్టడమే కాకుండా.. తల పై రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు.
నిఖిల్ పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని నంద్యాల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొంతకాలం క్రితం లోకేశ్ యువగళం పాదయాత్ర లో ఏవీ సుబ్బారెడ్డి పై జరిగిన దాడిలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఏవీ సుబ్బారెడ్డి వర్గీయులే నిఖిల్ ని హతమార్చేందుకు ఈ దాడి చేశారని భూమా వర్గీయులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
భూమా అఖిల ప్రియ బాడీ గార్డ్ మీద దాడి జరగడంతో ఆళ్లగడ్డ(Allagadda) లో ఈ నిమిషంలో ఏం జరుగుతుందో అని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.