Janhvi kapoor: ‘దేవర’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీకపూర్ నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబై, హైదరాబాద్ మధ్య తిరగడం ఆమెకు ఇబ్బందిగా మారిందట. దీంతో, హైదరాబాద్ లో రూ. 3 కోట్లతో ఒక ఇంటిని ఆమె కొన్నట్టు సమాచారం. త్వరలోనే తన మకాంను హైదరాబాద్ కు మారుస్తుందని చెపుతున్నారు. కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు ముంబైలో ఉండేటట్టు ప్లాన్ చేసుకుందని ప్రచారం జరుగుతోంది. సౌత్ లో బిజీ అయితే ఎక్కువ రోజులు ఉండేందుకు హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిందని చెపుతున్నారు.
జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తె అని తెలిసిందే. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఇక అది అలా ఉంటే ఈ భామ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న అనుకున్న బ్రేక్ రావడం లేదు.
ఇప్పటికే ఎన్టీఆర్ 30లో హీరోయిన్గా నటిస్తోన్న ఈ భామ మరో ఇద్దరు బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. టాలీవుడ్ నుంచి ఆమె సౌత్ ఇండస్ట్రీలోకి దేవర మూవీతో ఎంట్రీ ఇవ్వనుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చేపలు పట్టే కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రను జాన్వీ పోషిస్తోంది.
తెలుగులో ఎప్పటి నుంచో ఎంట్రీ ఇస్తున్నట్టు ప్రకటించిన జాన్వీకపూర్.. ఎట్టకేలకు ఎన్టీఆర్ సినిమాతో దక్షిణాదిలో తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ విషయమై ఎంతో ఆనందంగా ఉంది జాన్వీ కపూర్. తాజాగా ఈ భామ మరో స్టార్ హీరో సినిమాకు సైన్ చేసినట్టు సమాచారం. జాన్వీ కపూర్ అప్పుడపుడు తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. తక్కువ సమయంలోనే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను జాన్వీ సొంతం చేసుకుంది. ఇప్పడు దక్షిణాదిపై ఆమె దృష్టి సారించింది.
Also Read: ‘గణపథ్’ టీజర్ రిలీజ్..సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మెగాస్టార్..!