Actress Hema: సినీ నటి హేమ రీసెంట్ గా బెంగళూర్ రేవ్ పార్టీ కేసులో ఇరుకున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూ వీడియోను రిలీజ్ చేసింది. కానీ ఆ తర్వాత అసలు విషయం కనిపెట్టిన పోలీసులు హేమ కూడా రేవు పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలు బయటపెట్టారు. దీంతో విచారణ కోసం ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘MAA’ నుంచి ఆమె ప్రాథమిక సభ్యత్వాన్ని తొలగించారు.
హేమకు గుడ్ న్యూస్..
అయితే తాజాగా హేమకు ‘MAA’ శుభవార్తను చెప్పింది. ఆమె సస్పెన్షన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. కాగా , ఇటీవలే డ్రగ్స్ విషయంలో హేమకు రక్త పరీక్షలు నిర్వహించగా తనకు నెగెటివ్ వచ్చిందని ఆమె సోషల్ మీడియాలో రిపోర్టులను షేర్ చేసింది. ఆపై ఆమెకు బెయిల్ కూడా మంజూరు చేసింది కోర్టు. ఇక ఈ విషయాలనన్నీ పరిగణలోకి తీసుకున్న ‘మా’ హేమ సస్పెన్షన్ ను తిరిగి విచారించారు. కమిటీ సభ్యులతో చర్చల తర్వాత ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ఆమె సస్పెన్షన్ ను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాల గురించి మీడియా, ప్రెస్ తో చర్చించకూదని సూచించారు.
Also Read: VIDAAMUYARCHI : ‘విదాముయార్చి’ రిలీజ్ అప్డేట్ .. వైరలవుతున్న పోస్టర్ – Rtvlive.com