Heavy Rains in AP
భయంకరంగా మైచౌంగ్ తుఫాన్…ఏపీలో దంచికొడుతున్న వానలు…!!
Cyclone Michaung : నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా మైచౌంగ్ తుఫాన్ కదులుతోంది. గంటకు 13కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ప్రస్తుతానికి చెన్నైకి 150 కి.మీ, నెల్లూరుకు 250 కి.మీ, బాపట్లకు 360 కి.మీ, మచిలీపట్నానికి (Machilipatnam)380కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా విస్తరించనుంది. రేపు మధ్యాహ్ననం నెల్లూరు (Nellore) – మచిలీపట్నం మధ్య తీవ్రతుఫానుగా తీరం దాటుతుందని వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీని ప్రభావంతో నేడు,రేపు కూడ కోస్తాంధ్రలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్రభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించారు. రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని…ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదైయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 80 -100 కీమీ, సాయంత్రం నుంచి గంటకు 90-110 కీమీ వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని డా. బి.ఆర్ అంబేద్కర్ , విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు.
అటు చిక్కోలు తీరంలో మిఛౌంగ్ (Cyclone Michaung) వాయుగుండం సంకేతాలు కనిపిస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08942_240557. అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు కలెక్టర్ శ్రీకేష్ బి లాటకర్. చేపల వేటపై నిషేదాజ్ఞలు, పోలీస్, మెరైన్ పోలీస్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేసింది. మైదాన ప్రాంతంలో వరి పంటకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఇక తిరుపతిలో (Tirupati) తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. మైచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. పూర్తి సామర్థ్యంతో జిల్లాలోని పలు ప్రాజెక్టులు జలకళతో కలకలలాడుతున్నాయి. సామార్థానికి మించి వరద నీరు వచ్చి చేరుతుండటంతో కొన్ని ప్రాజెక్టుల్లో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో ఘతపతాలీ. కొన్ని ప్రాంతాలకు వర్షం కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాళహస్తిలో పూరి గుడిసె కూలి ఓ చిన్నారి మృతి చెందింది.
ఇది కూడా చదవండి: వాట్సాప్ లో అదిరిపోయే ఫీచర్…చాటింగ్ కోసం సీక్రెట్ కోడ్…యాక్సెస్ చేయడం ఎలాగో తెలుసా?
Cyclone Alert: అలెర్ట్.. తుపాను ముప్పు.. ఏపీ, తెలంగాణకు వర్షాలు!
Heavy Rains in AP and Telangana: ఓవైపు తెలంగాణ ఎన్నికల ఫీవర్ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఊపేస్తుండగా.. మరోవైపు వరుణుడు స్లోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ‘మిగ్జామ్’ తుపాను అల్లకల్లోలం సృష్టిస్తుందానన్న ఆందోళన నెలకొంది. బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి డిసెంబర్ 4న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌కు తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం వాయువ్య దిశగా పయనించి, బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి డిసెంబర్ 3న ‘మిగ్జామ్” తుపాను(Michaung Cyclone)గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
భారీ వర్షాలు కురుస్తాయా?
ప్రస్తుతానికైతే ఈ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచనైతే లేదు. ఇవాళ(డిసెంబర్ 1), రేపు(డిసెంబర్ 2) అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే అల్పపీడనం తుపానుగా మారిన తర్వాత అంటే డిసెంబర్ 3-4 తేదీల్లో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం కనిపిస్తోంది. అటు తమిళనాడు, పుదుచ్చేరిలో ఈ నాలుగు రోజులూ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా డిసెంబర్ 3 తర్వాత ఈ తమిళనాడు తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మియన్మార్ ప్రతిపాదించిన ఈ తుపానుకు ‘మిచాంగ్’ అని పేరు పెట్టారు. దీన్ని ‘మిగ్జామ్’గా ఉచ్ఛరించాలి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఈ తుపాను పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఇది ఏర్పడితే ఈ ఏడాది బంగాళాఖాతంలో ఏర్పడిన నాలుగో తుపాను అవుతుంది. ఈ ఏడాది భారత జలాల్లో ఆరోది అవుతుంది.
డిసెంబర్ 3- 4 తేదీలలో ఆంధ్రప్రదేశ్ కోస్తా బెల్ట్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బాపట్ల, పల్నాడు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తాయని అంచనా. ఇక తుపాను కారణంగా సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఐఎండీ(IMD) హెచ్చరించింది.
Also Read: టుక్ టుక్ ప్లేయర్‌కు వన్డే కెప్టెన్సీ.. ఇది కరెక్ట్ కాదు భయ్యా!
Rains in AP, Telangana: అల్పపీనడం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!
Heavy rains in Telugu states: భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీనడం కారణంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగినట్టు ఐఎండీ(IMD) ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారినట్టు తెలిపింది. ప్రస్తుతం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం వెంబడి అల్పపీనడం కేంద్రీకృతమైంది. అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణకు హై అలర్ట్:
తెలంగాణలో కుండపోతక కారణంగా 11 జిల్లాలకు రెడ్ అలర్ట్(Red alert) జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ నగరంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోజంతా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ(సెప్టెంబర్ 5) తెల్లవారు జామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల్లోనే 100 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వర్షానికి జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. రోజంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. భారీ వర్షాల సమయంలో నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. సమస్యలు ఉన్నవారు 040-21111111కు ఫోన్ చేయవచ్చు. మరోవైపు వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Also Read: తెలంగాణలో మరో ఐదురోజులు వానలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ
ఏపీలోనూ భారీ వర్షాలు:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఏపీ, దక్షిణ కోస్తా, రాయలసీమ, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇటు ప్రకాశం, నంద్యాల, కర్నూలు, కాకినాడ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ప్రకాశం జిల్లా గుండ్లకమ్మ వాగులో కూరగాయల వ్యాపారి షేక్ మహ్మద్ ఖాసీం నీట మునిగి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తున్న 42 ఏళ్ల ఖాసీం ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి భారీగా వరద ప్రవాహం వస్తున్న వాగును దాటేందుకు ప్రయత్నిస్తుండగా కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సహాయక చర్యలకు ఆటంకం కలిగించాయి.
ALSO READ: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అతి భారీ వర్షం.. రెండు గంటలు దంచిపడేసింది!
Rains in Ap, Telangana: లైట్ తీసుకుంటే అంతే..ఈరోజు నుంచి వర్షాలు..కుమ్ముడే కుమ్ముడు!
Heavy rains likely to prevail over Telangana, Andhra Pradesh till September 7: రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు మరోసారి విరుచుకుపడనున్నాడు. ముఖ్యంగా తెలంగాణ(Telangana)కు ఇవాళ్టి నుంచి దంచుడే దంచుడు. తెలంగాణలో ఇవాళ్టి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్(orange alert) జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్(Yellow alert) జారీ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల , కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతాయి. ఇటు హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఎల్లుండు(సెప్టెంబర్ 6) వరకు తెలంగాణకు భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది.
పిడుగుపాటుకు ప్రాణం పోయింది:
బంగాళాఖాతం(bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వర్షంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌రావు(talasani srinivasa rao) జీహెచ్ఎంసీ(GHMC)ని ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో పిడుగుపాటుకు 30 ఏళ్ల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పిడుగుపాటుకు గురైన వ్యక్తి సతీశ్(30)గా గుర్తించారు క్రికెట్ ఆడేందుకు సిరిసిల్లలోని గణేష్ నగర్ మైదానానికి వెళ్లిన సతీశ్. వర్షం పడుతుండగా చెట్టు కింద తలదాచుకున్నాడు.. అదే సమయంలో పిడుగుపాటుకు గురవడంతో చనిపోయాడు. అటు మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ కటౌట్ పడిపోవడంతో మూవింగ్ దెబ్బతింది. సిరిసిల్ల జిల్లా ములవాగులోకి వరద నీరు చేరింది. నివేదికల ప్రకారం నిజామాబాద్‌లో 257 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 15 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లోని మిడ్జిల్‌లో ఆదివారం వర్షం కురిసింది. రోడ్లపై నీరు ప్రవహించడంతో వెలుగొమ్ము-కొత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దుమ్ముదుంబి నదికి భారీగా వరదనీరు వచ్చి చేరింది.
ఏపీలోనూ తప్పదు:
వాయువ్య బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ(IMD) చెప్పింది. ఈశాన్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. మరో తుఫాను వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో ఉంది. ఈ వాతావరణ పరిస్థితులు రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కారణమవుతున్నాయి. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతుందని, దీనివల్ల ఏపీలోని ఉత్తర జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు జిల్లాల్లో వరదలు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో సెప్టెంబర్ 7 వరకు భారీ వర్షాలు కురుస్తాయి.
ALSO READ: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!
Heavy Rain Alert: అలర్ట్: ఏపీలో ఈరోజు, రేపు ఉరుములు..మెరుపులతో భారీ వర్షాలు!
Heavy Rain Alert: ఏపీలో మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపించనున్నాడు. ఇప్పటికే గత వారం నుంచి ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈరోజు రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ కీలక అప్డేట్ ను వెల్లడించింది.
ఇక నైరుతి,పశ్చిమ గాలుల ఎఫెక్ట్ తో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరణ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఈ రోజు ఉత్తర,దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల, అదే విధంగా రేపు ఆదివారం కొన్ని చోట్ల వర్షాలు భారీగా పడనున్నాయి. ఇక రాయలసీమలో శని,ఆదివారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిస్తాయని.. అంతే కాకుండా పిడుగులు కూడా పడొచ్చని అధికారులు అలర్ట్ జారీ చేశారు. దీంతో ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రైతాంగం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాగా, దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు ఉన్న ఉత్తర దక్షిణ ద్రోణి బలహీనపడింది.
మరో వైపు దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి,పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ ఎఫెక్ట్ తో ఈరోజు ఉత్తర,దక్షిణ, కోస్తాంధ్ర లో అనేక చోట్ల అదే విధంగా ఆదివారం కొన్ని చోట్ల అలాగే రాయలసీమలో శని ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ కూడా హచ్చరిస్తోంది.
శుక్రవారం కురిసిన భారీ వర్షాలు..!
ఇక ఉత్తరాంధ్రలో శుక్రవారమే పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరం, శ్రీకాకుళం, సంతబొమ్మాళి, విశాఖ భీముని పట్నంలో భారీ వర్షాలు కురిశాయి. అయితే ఏపీలో ఓ వైపు వర్షాలు కురుస్తుంటే, మరోవైపు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తరకోస్తాలో పలుచోట్ల మాత్రం ఎండ దంచి కొడుతుంది. దీంతో జనం ఉక్కబోతతో అల్లాడిపోతున్నారు.
Also Read: మరో వివాదంలో టీటీడీ.. పాలకమండలిలో లిక్కర్ స్కాం నిందితుడికి చోటు