MEGA 156 TITLE RELEASE : గతేడాదికి వాల్తేరు వీరయ్య చిత్రం సంక్రాంతి కానుకగా కెవ్వ్హ్య్ మెగాభిమానులకు తిరుగులేని హిట్ ఇచ్చింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయే సరికి మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డ మాట వాస్తవమే. కాని.. ఆ నిరాశలు పటాపంచలు చేస్తూ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి బింబిసార దర్శకుడు వశిష్ఠ కాంబోలో తెరకెక్కుతోన్న మెగా 156 టైటిల్ విషయంపై చాలా రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి.విశ్వంభర అనే టైటిల్ ఖరారైనట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. టైటిల్ ఏంటి అనేదానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
సంక్రాంతి కానుకగా జనవరి 15న టైటిల్
ఈ ఉత్కంఠతకు రేపటితో తెరలేపనుంది.ఈ విషయంపై మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న సోమవారం సాయంత్రం 5:00 గంటలకు టైటిల్ ను ప్రకటించనున్నట్లు అప్డేట్ ఇవ్వడంతో టైటిల్ ఏంటా అని అందరిలోనూ ఆలోచన మొదలయింది.
The revelation of MEGA MASS BEYOND UNIVERSE begins 🔥❤🔥#Mega156 Title Reveal on January 15th at 5 PM 💫🌠
MEGASTAR @KChiruTweets @mmkeeravaani @boselyricist @NaiduChota @saimadhav_burra @UV_Creations pic.twitter.com/w5MzjjRPDj
— Vassishta (@DirVassishta) January 14, 2024
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల
ఈ చిత్రానికి స్వరవాణి కీరవాణి సంగీతం సమకూర్చుతుండగా .. చంద్రబోస్ సాహిత్యాన్ని అందిస్తున్న పాట రికార్డింగ్‌తో సినిమా పూజాకార్యక్రమాలతో చిత్రం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ మూవీని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ చేసేపనిలో దర్శకుడు వశిష్ఠ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బింబిసార బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న ప్రాజెక్టు కావడం ఒక ఎత్తు అయితే.. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ లాంటి సోషియో ఫాంటసీ చిత్రం తరువాత ఆ జానర్ లో చేస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై ప్రత్యేక శ్రద్ద తీస్కుని వర్క్ చేస్తున్నాడు వశిష్ఠ. మెగా స్టార్ చిరంజీవి టాప్ టెన్ చిత్రాల్లో టాప్ త్రి లో ఈ మూవీ ఉండే విధంగా తెరకెక్కిస్తానని దర్శకుడు వశిష్ఠ ఆశాభావం వ్యకతం చేశారంటే .. ఆడియన్స్ లో ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో తెల్సిందే. ఈ మెగా 156 వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. టైటిల్ రేపు ఈ టైంకి ట్రెండ్ సెట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ద్విపాత్రల్లో చిరు
ఈ మూవీలో చిరుకి జోడిగా త్రిష అలరిస్తుండగా .. మరో ముగ్గురు హీరోయిన్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ అయిన ఈ చిత్రం త్వరలో సెట్స్ లోకి వెళ్లనుంది. చిరు ద్విపాత్రల్లో అలరించనున్నారని సమాచారం. వెండితెరపై ఒక.. చిరంజీవినే చూస్తుంటేనే పూనకాలు వచ్చేస్తాయి. మరి.. డ్యూయల్ రోల్స్ లో చిరు ఆంటే పూనకాలు రెండు రెట్లు
పెరుగుతాయని ఖచ్చితంగా చెప్పొచ్చు.
ALSO READ:లాభాల్లో హనుమాన్ .. వసూళ్లు చూస్తే మైండ్ బ్లాక్ !!