HBD Mrunal Thakur: ‘ఓ సీతా వదలనిక తోడౌతా’.. అంటూ ప్రేక్షకుల హృదయాలను దోచేసిన మహారాష్ట్ర ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు నేడు. నేటితో మృణాల్ 32వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా మృణాల్ సినీ కెరీర్ గురించి తెలుసుకుందాము..
మృణాల్ మహారాష్ట్రలోని ధూలేలో ఆగస్టు 1, 1992లో జన్మించింది. టీవీ సీరియల్స్ తో కెరీర్ మొదలు పెట్టిన మృణాల్.. నటనలో తనకున్న టాలెంట్ తో ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది.
2012లో టీవీ సీరియల్స్ ‘ముజ్సే కుచ్ కెహ్తీ’…’యే ఖామోషియాన్’, ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్ తో నటనను ప్రారంభించింది. మృణాల్ నటించిన కుంకుమ్ భాగ్య సీరియల్ ఆమెకు బుల్లితెర ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది.
ఆ తరువాత 2018లో లవ్ సోనియా సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది ఈ ముద్దు గుమ్మ. ఈ మూవీలో మృణాల్ తన నటనతో మెప్పించినప్పటికీ.. కమర్షియల్గా అందుకోలేకపోయింది ఈ మూవీ.
ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న మృణాల్ … ఒకానొక సమయంలో మృణాల్ చాలా విమర్శలు ఎదుర్కొంది. అసలు సినిమాకు పనికొచ్చే మోహమేనా.. టీవీ సీరియల్ నటి హీరోయిన్ కావడం ఏంటి అనే కామెంట్స్ కూడా వచ్చాయట.
అయినప్పటికీ మృణాల్ తన టాలెంట్ నిరూపించుకునే ఏ ప్రయత్నాన్ని వదల్లేదు. హిందీలో ‘సూపర్ 30’, బాట్లా హౌస్ చిత్రాలు మృణాల్ కు మంచి గుర్తింపు తెచ్చాయి.
ఆ తరువాత ఓ సినిమా ఈవెంట్ లో తెలుగు దర్శకుడు నాగశ్విన్ కంటపడిన మృణాల్ కు ‘సీతారామం’ అవకాశం దక్కింది. 2022లో విడుదలైన ఈ చిత్రం మృణాల్ కెరీర్ ను మార్చేసింది. ఈ సినిమాలో మృణాల్ నటన, అభినయం ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకున్న ఈ ముద్దు గుమ్మ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో ‘సీతారామం’, ‘హయ్ నాన్న’ చిత్రాలు మృణాల్ కు ఉత్తమ నటిగా SIIMA, ఫిల్మ్ ఫెయిర్ అవార్డులను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మృణాల్ కల్కి 2898 AD పార్ట్ 2లో కీలక పాత్రలో నటిస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో అతి కొద్ది సమయంలోనే స్టార్ నటిగా క్రేజ్ సంపాదించుకునే హీరోయిన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో మృణాల్ కూడా ఉంటుంది.
Also Read: Turbo Movie: ఓటీటీలో మమ్ముట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే.. – Rtvlive.com