Pawan Kalyan: డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ సినిమా కోసం చాలా ఏళ్లు వెయిట్ చేస్తున్నాడు. మైత్రీ మేకర్స్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ ఎన్నో సమస్యలు, ఎన్నో వాయిదాలు, ఇంకెన్నో అడ్డంకులకు ఆ ప్రాజెక్ట్ గురవుతూనే ఉంది. భవదీయుడు భగత్ సింగ్ అంటూ కొత్తగా కథ రాసుకున్నాడు హరీష్ శంకర్. కానీ, అది చివరకు ఉస్తాద్ భగత్ సింగ్ అయింది. ‘విజయ్ తేరి’ సినిమా రీమేక్‌గా రానుంది. పోనీ ఆ రీమేక్ అయినా టైంకు వస్తుందా? అని అభిమానులు అనుకున్నారు. కానీ వారికి ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతూనే ఉంది.
Also Read: తండ్రి కాబోతున్న టాలీవుడ్ హీరో.!
ఇక ఉస్తాద్ విషయంలో కొంత మంది అభిమానుల సలహాలు కూడా ఎక్కువయ్యాయి. వాటిపై హరీష్ శంకర్ తన స్టైల్లో కౌంటర్లు వేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలను త్వరగానే పూర్తి చేస్తున్నాడు. ‘క్రిష్’, హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ ప్రాజెక్టులు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్ ఎప్పుడు పూర్తవుతాయో ఎవ్వరికీ తెలియడం లేదు.
ఇక ఇప్పుడు ఎన్నికలు సమీపించాయి. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ బిజీ కానున్నాడని తెలుస్తోంది. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తిగా వెనక్కి వెళ్లేలా కనిపిస్తోందట. అందుకే హరీష్ శంకర్ ఈ సినిమాని పక్కన పెట్టేసి, రవితేజతో మూవీ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీనికి సంబంధించి గత రెండ్రోజులుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ రూమర్లు చూసి చూసి సహనం కోల్పోయినట్టుగా ఉన్నాడు మన మాస్ డైరెక్టర్ హారీష్ శంకర్. అందుకే కాస్త గట్టిగానే కౌంటర్ వేశాడు. సోషల్ మీడియాలో వస్తున్నా ఆ రెండు వార్తలు తప్పే.. ఈ అవేశమే తగ్గించుకుంటే మంచిది అని సెటైర్ వేశాడు. ముందు తగ్గించుకోవాల్సింది ఈ ఎటకారాలే అని హరీష్ శంకర్ కాస్త ఘాటుగా స్పందించాడు. హరీష్ శంకర్ వేసిన కౌంటర్లకు నెటిజన్లు సలాం కొట్టేస్తున్నారు. అది అలా ఇవ్వు అన్నా.. అంటూ డైరెక్టర్‌కు వత్తాసు పలుకుతున్నారు ఫ్యాన్స్.