అన్ని ఎందుకు ఆర్డర్ చేశావ్ బ్రో.. అమ్ముకున్నావా?
డిసెంబర్ 31(2023) ఒక్క రోజే గంటకు 1,722 చొప్పున కండోమ్‌లను ఆర్డర్ చేసినట్టు సోషల్‌మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక అదే సమయంలో డెలివరీ యాప్ కంపెనీ బ్లింకిట్(Blinkit) ఓ ఆసక్తికరమైన డేటాను రిలీజ్ చేసింది. గతేడాది ఆన్లైన్ డెలవరీకి చెందిన ఇన్ఫోర్మెషన్ అది. ఈ లెక్కల ప్రకారం ఓ ఢిల్లీ నివాసి ఏడాది పొడవునా మొత్తం 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేశాడు. సంవత్సరం చివరిలో చాలా కంపెనీలు ఈ ఏడాదికిసంబంధించిన వారి అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తాయి. అయితే పన్నెండు నెలల్లో ఒకే వ్యక్తి నుంచి సుమారు పది వేల కండోమ్ ఆర్డర్లు రావడంతో డెలివరీ యాప్ కంపెనీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
Not sure if it is the same person but someone just bought 81 condoms in a single order 👀 https://t.co/37I2wO8gZo
— Albinder Dhindsa (@albinder) December 31, 2023
రోజుకు 27:
బ్లింకిట్ ప్రకారం, దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి దాదాపు ప్రతిరోజూ కండోమ్‌లను ఆర్డర్ చేశాడు. ఆ వ్యక్తి ప్రతిరోజూ దాదాపు 27 కండోమ్‌లు కొనేవాడు. ప్రతి గంటకు ఒక కండోమ్ ఉపయోగించినా రోజుకు ఉండేది 24గంటలే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతను సైడ్ బిజినెస్ కండోమ్ సేల్స్ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన డేటాతో బ్లింకిట్ ఒక ట్వీట్ వేసింది. మరోవైపు అదే సమయంలో నిన్న ఒక వ్యక్తి ఒకేసారి 81 కండోమ్‌లు ఆర్డర్ చేశాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. ఈ ఢిల్లీ వ్యక్తి ఆ సింగిల్ ఆర్డర్లో 81 కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరేనానన్న అనుమానం నెటిజన్లలో కనిపిస్తోంది. ఇక సురక్షితమైన లైంగిక సంపర్కానికి కండోమ్ వాడకం చాలా ముఖ్యం. అటు బ్లింకిట్ నివేదించిన మిగిలిన ఆర్డర్ల విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎగ్జాంపూల్ చూస్తే ఓ వ్యక్తి ఒక నెలలో 38 లోదుస్తులను ఆర్డర్ చేస్తాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాది పొడవునా 17 వేల కిలోల బియ్యాన్ని ఆర్డర్ చేశాడు.
WATCH: