Hanuman Official Trailer: యంగ్ హీరో తేజ సజ్జ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘హనుమాన్’. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ (Teja Sajja) కాంబినేషన్ లో రాబోతున్న రెండో చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం జాంబీ రెడ్డి. ఫిక్షనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పటికే విడుదలైన ”హనుమాన్’ టీజర్ ప్రేక్షకులలను బాగా ఆకట్టుకుంది. పాన్ ఇండియా సూపర్ హీరో చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా 2024 జనవరి 12 న విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు.
‘కలియుగంలో ధర్మం కోసం పోరాడే వారి వెంట హనుమాన్ ఉంటాడు’ అనే డైలాగ్స్ అందరిని ఆకట్టుకునేలా ఉన్నాయి. అసమానమైన శక్తి సామర్థ్యాలను పొందే పవర్ గురించి తెలుసుకున్న విలన్.. దాన్ని సొంతం చేసుకోవడానికి.. హీరో పై దాడి చేస్తాడు. ధర్మం కోసం పోరాడే హీరోను హనుమంతుడు ఎలా కాపాడాడు అనే విధంగా ట్రైలర్ సాగింది. ట్రైలర్ లోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను అధివాస్తవికమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేలా కనిపించాయి. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆ థియేటర్ లో ‘సలార్’ సినిమాకు 100 టికెట్స్ ఫ్రీ.. హీరో నిఖిల్ బంపర్ ఆఫర్..!
సినిమాలో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ హీరోకు అక్క పాత్రలో కనిపించనుంది. పలు దేశాల్లో 11 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ట్రైలర్ లోని VFX, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటిక్ విజువల్స్ సినిమా పై మరిన్ని అంచనాలను పెంచేసింది.
Also Read: Salaar Trailer: ‘ఖాన్సార్ ఎరుపెక్కాలా’.. సలార్ ట్రైలర్ అదిరిపోయింది..!