Allu Arjun reviews Hi Nanna Movie: నాని (Nani) ఈ ఏడాది మంచి జోరు మీద ఉన్నాడు. దసరా సినిమాతో మాస్ హిట్ ని ఖాతాలో వేసుకుంటే..హాయ్ నాన్న (Hai Nanna) సినిమాతో క్లాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో నానికి జంటగా మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని శౌర్యువ్ తెరకెక్కించాడు.
ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల లవ్ ఎమోషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసినట్లు తెలుస్తుంది. రోజురోజుకి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాని అల్లు అర్జున్ (Allu Arjun) చూసి రివ్యూ ఇచ్చారు. దీని గురించి ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సినిమా చాలా బాగుందంటూ చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.
” హాయ్ నాన్న సినిమా యూనిట్ కి అభినందనలు. చాలా మంచి సినిమా, మనసుని హత్తుకుంది. నాని గారు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇలాంటి మంచి కథలని బయటకి తెచ్చినందుకు మీ మీద గౌరవం పెరిగింది. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చాలా బాగా చేసింది. తన నటన కూడా తనలాగే అందంగా ఉంది. బేబీ కియారా నీ క్యూట్ నెస్ తో మా గుండెల్ని పిండేశావు. ఇంక చాలు, స్కూల్ కి వెళ్ళు. సినిమాలోని మిగిలిన ఆర్టిస్టులందరికి కంగ్రాట్స్. కెమెరామెన్ సాను వరుగేస్, సంగీత దర్శకులు హేశం అబ్దుల్ వహీద్, డైరెక్టర్ శౌర్యువ్ వర్క్ బాగా చేశారు. శౌర్యువ్ నీ మొదటి సినిమాతోనే అందర్నీ మెప్పిస్తున్నావు. గుండెని హత్తుకునే సన్నివేశాలను ఎంతో అందంగా చూపించావు, ఇలాగే ముందుకెళ్లాలి, కంగ్రాట్స్. నిర్మాతలకు కూడా ఇలాంటి మంచి సినిమా తెచ్చినందుకు కంగ్రాట్స్. హాయ్ నాన్న సినిమా కేవలం ఫాదర్స్ కి మాత్రమే కాదు ప్రతి కుటుంబాన్ని తాకుతుంది” అంటూ పోస్ట్ పెట్టారు.
బన్నీ రివ్యూని చూసిన చిత్ర బృందం..బన్నీకి థ్యాంక్స్ చెప్పారు. ఈ ట్వీట్ చూసిన నాని అర్హ వాళ్ల నాన్న మెచ్చుకున్నారు.థ్యాంక్స్ బన్నీ. నువ్వు మంచి సినిమా కోసం ఎప్పుడూ ఉంటావు అని రిప్లై ఇచ్చారు. గతంలో కూడా అల్లు అర్జున్ జెర్సీ, దసరా సినిమాలకు కూడా అభినందిస్తూ ట్వీట్ చేశారు.
Congratulations to the entire team of #HiNanna . What a sweet warm film . Truly heart touching.
Effortless performance by brother @NameIsNani garu . And my respects for green lighting such captivating script and bringing it into light .
Dear @Mrunal0801 . Your sweetness is…— Allu Arjun (@alluarjun) December 11, 2023
Also read: ఏపీకి పొంచి ఉన్న మరో తుపాన్ ముప్పు