GVL Narasimha Rao: విశాఖ ఎంపీ టికెట్ రాకపోవడంపై జీవీఎల్ స్పందించారు. తనకు టికెట్ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు కలత చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ..అనేక సమస్యలకు పరిష్కారం చూపానన్నారు. విశాఖ అభివృద్ధి కోసం తీవ్ర కృషి చేశానని పేర్కొన్నారు. తాను చేసిన సేవ నిస్వార్థమైనదని..ఎన్నికల కోసం చేయలేదని చెప్పుకొచ్చారు. జీవీఎల్ ఫర్ వైజాగ్ అనేది నిరంతర ప్రక్రియనని కామెంట్స్ చేశారు. త్వరలోనే విశాఖ వచ్చి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తానన్నారు. విశాఖలోనే ఉంటా..అభివృద్ధికి భవిష్యత్తులో కృషి చేస్తానని వ్యాఖ్యనించారు.