పల్నాడు జిల్లా గురజాల మండలం జంగమహేశ్వరపాడులో వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి(Krishna Reddy) దారుణహత్యకు గురవడం అటు స్థానికంగానూ, ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతోంది. పక్కా పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి హత్య చేశారు ప్రత్యర్థులు. కృష్ణారెడ్డిని ప్రత్యర్థులు వేట కొడవళ్లతో నరికి చంపారు. గ్రామానికే చెందిన పరమేశ్వర రెడ్డికి , కృష్ణారెడ్డికి మధ్య గొడవలు ఉన్నాయి. పాతకక్షలతో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణారెడ్డి హైదరాబాద్‌లో ఉంటున్నారు. అయితే దసరా పండుగ కావడంతో స్వగ్రామానికి వచ్చిన ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారడం సంచలనం సృష్టించింది. కృష్ణారెడ్డి హత్యలో ఐదుగురు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
Also Read: తెలంగాణలో జనసేన-బీజేపీ పొత్తు.. అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీకి ముహూర్తం ఖరారు!
రాజకీయ రంగు:
కృష్ణారెడ్డి హత్యపై గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి(Kaasu mahesh reddy) కామెంట్స్ చేశారు. కృష్ణారెడ్డి హత్య అత్యంత దుర్మార్గమన్నారు. హత్యలు చేసి భయాందోళనలు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కుట్రలు సాగనివ్వబోమన్నారు మహేశ్‌రెడ్డి. కృష్ణారెడ్డి హత్యకేసులో పాల్గొ్న్న వారిని కఠినంగా శిక్షించాలని.. హత్యకు పరోక్షంగా కారణమైన యరపతినేని శ్రీనివాసరావుపై కూడా చట్టపరంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. ఈ హత్య కేసులో ఎంతటి వారున్నా, మాజీ శాసనసభ్యులు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నిజాలు బయటకు రావాలంటూ వ్యాఖ్యానించారు.
మాజీ ఎమ్మెల్యే కౌంటర్:
మరోవైపు మహేశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు(Yarapathineni srinivasa rao). వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు మంది టీడీపీ నేతలు దారుణహత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి అక్రమాలతో ఎనిమిది మంది చిన్నారులు చనిపోయారన్నారు యరపతనేని. వ్యక్తిగత కక్షలు, ఇతర ఎఫైర్స్‌తో కృష్ణారెడ్డి హత్య జరిగితే రాజకీయ రంగు పులమాలని చూస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని. కాసు మహేశ్‌రెడ్డి వచ్చిన తర్వాతే గురజాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు పెరిగాయన్నారు యరపతినేని. ఇలాంటి జిమ్మిక్కులు చాలా చూశామని.. ఎవరికీ భయపడేది లేదని కౌంటర్ వేశారు మహేశ్‌రెడ్డి. పోలీసులు కృష్ణారెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేపట్టాలన్నారు యరపతనేని.
Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకుందా?