Guppedantha Manasu : రిషి(Rishi) తో ఫోన్లో మాట్లాడిన వసు మొత్తానికి అడ్రస్ తెలుసుకుని రిషి దగ్గరకు వస్తుంది. రిషిని ఆ పరిస్థితుల్లో చూసి కన్నీరుమున్నీరవుతుంది. మిమ్మల్ని ఇలా చూడటం చాలా బాధగా ఉంది. అన్నిరోజులు మనవిగా ఉండవు కదా. మన సమయం బాగలేనప్పుడు..పేరు, వైభవం అన్ని తుడిచిపోతాయి. మామూలు మనిషిగా బతకాలి. అవన్నీ జీవితంలో భాగాలు మాత్రమే అంటూ ఓదార్చుతాడు. నలుగురి మేలు కోరే మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటుంది వసు. ఇన్నాళ్లు ఎక్కడున్నారో..ఎలా ఉన్నారో..ఏమైపోయారో తెలియక చాలా భయపడ్డాంటూ జరిగనవన్నీ చెబుతుంది వసు. మార్చురీలో డెడ్ బాడీ మీదే కావొచ్చని టెన్షన్ పడ్డాను అంటూ బాధను దిగమింగుకుంటూ రిషికి చెబుతుంది వసు. మీరు కనిపించకుండా పోయిన తర్వాత కాలేజీకి సరిగ్గా వెళ్లలేదని..బోర్డు సమావేశాలకు హాజరుకావడం లేదంటుంది వసు.
రిషి:
వసు(Vasu) మాట్లాడుతుండా.. మధ్యలో రిషి నేను కనిపించకుండా పోతే ఇదంతా జరిగిందా? ఒకవేళ నాకు ఏమైనా జరిగి ఉంటే..!!
వసుధర:
అలాంటివి మాట్లాడకండి సార్. మీలాంటి వాళ్లకు ఏం కాదు. మీకు ఏం కాకుండా నేను చూసుకుంటాను. కానీ నేను చాలా భయపడ్డాను. కానీ మహీంద్ర సార్ కూడా మీ మీద చాలా బెంగ పెట్టుకున్నారు. మేము మిమ్మల్ని వెతకని చోటు లేదు..మీ ఆచూకీ కోసం తిరగని ప్రదేశం లేదు..అడగని మనిషిలేదు..పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాం అని చెబుతుంది వసు. రిషిని కాపాడిన పెద్దయ్య, పెద్దమ్మలకు చేతులెత్తి నమస్కారం పెడుతుంది వసు. అసలు రిషి కిడ్నాప్ ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది వసు. కానీ రిషి చెప్పలేని పరిస్ధితుల్లో నొప్పితో విలవిల్లాడుతుంటాడు.
మహేంద్రకు క్లాస్ పీకిన అనుపమ:
మహేంద్ర భోజనం చేయకపోవడంతో అనుపమకు కోపం వస్తుంది. దీంతో మహీంద్రకు క్లాస్ పీకుతుంది. అసలు రిషీ ఏమయ్యాడు. ఇప్పుడు వసు ఆచూకీ కూడా లేదు. నాకేవిధంగా ఉంటుంది చెప్పు. ఇలాంటి పరిస్థితుల్లో తాను భోజనం ఎలా చేస్తాను అంటాడు మహేంద్ర. రిషికోసమే వసు కూడా వెళ్లి ఉంటుందని మహేంద్రకు అనుపమ ధైర్యం చెబుతుంది. నీకు తోడు నేను ఉన్నానన్న ధైర్యంతోనే వసు బయటకు వెళ్లి ఉంటుందని చెప్పి భోజనం చేయాలని రిషిపై ఒట్టు తీసుకుంటుంది అనుపమ.
వసుధర కిడ్నాప్ :
వసుధార(Vasudhara) చేతిలో దెబ్బలు తిన్న రౌడీలు…వసుని ఎలాగైనా పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. వసును వెతకుతుంటారు. మరోవైపు వసు రిషిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నీ ప్రేమ నాకు చాలా శక్తిని ఇచ్చింది..నిన్ను చూడగానే నా మనసు తేలికపడింది అంటాడు రిషి. తన మొహంలో వెలుగు నిండిపోతుంది అంటుంది పెద్దమ్మ. ఆ తర్వాత వసు చేయికడుక్కునేందుకు బయటకు వస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రౌడీలు వసును కిడ్నాప్ చేస్తారు. వసుకు ఫోన్ రావడంతో ఇవ్వడానికి పెద్దమ్మ బయటకు వస్తుంది. కానీ బయట వసు కనిపించదు. దీంతో పెద్దమ్మ కంగారు పడుతుంది. లోపలకు వచ్చి రిషికి ఆ విషయం చెబుతుంది. వసును ఎలాగైనా కాపాడాలనుకుంటాడు రిషి. కానీ నీరసంగా ఉండటంతో లేవలేనిపరిస్థితిలో ఉంటారు. వసు ఫోన్ అక్కడే ఉండటంతో మీకు తెలిసినవారికి ఫోన్ చేసి వసుని కాపాడమని చెప్పు అని రిషికి సలహా ఇస్తాడు పెద్దయ్య.
Also Read : వామ్మె.. బికినీలో దర్శనమిచ్చిన గుప్పెడంత మనసు సీరియల్ జగతి.!
ఇక వసును కిడ్నాప్ చేసిన రౌడీమూకలు ఆమెను కట్టేస్తారు. ఆ విషయాన్ని శైలేంద్ర(Shailendra) కు ఫోన్ చేసి చెబుతారు. వారి మాటలను శైలేంద్ర నమ్మకపోవడంతో వీడియో కాల్ చేసి వసును చూపిస్తారు. తను వచ్చేంత వరకు వసును ఓ కంట కనిపెట్టమంటూ హెచ్చరిస్తాడు శైలేంద్ర. తాను వేసిన ప్లాన్ సక్సెస్ కావడంతో శైలేంద్ర ఫుల్ హ్యాపీగా ఉంటాడు. వసుపై ఇన్నాళ్లు పెంచుకున్న పగ తీర్చుకునే ఛాన్స్ వచ్చిందని మనసులో అనుకుంటాడు. శైలేంద్ర అంటే ఏంటో వసుకు చూసిస్తా అని మనుసులో అనుకుంటాడు. ఇంతో దేవయాని అక్కడికి వస్తుంది. ఏంటీ ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది.
అప్పుడు శైలేంద్ర తర్వాత చెబుతా మమ్మీ. వసు నన్ను కొట్టిన చెంపదెబ్బకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. త్వరలోనే డీబీఎస్టీ కాలేజీ ఎండీగా నన్ను చూడబోతున్నావ్ అంటాడు శైలేంద్ర. ఇంతలో అక్కడికి ధరణి వచ్చి నేను కూడా వస్తాను అంటుంది. అప్పుడు శైలేంద్ర నేను మాత్రమే వెళ్తాను..నాతో ఎవ్వరూ రాకూడదు. మమ్మీ కూడా వచ్చిది కాదు..నేను ఒక్కడినే వెళ్లాలి అంటాడు. అప్పుడు ధరణి నాతో ఏదీ సరిగ్గా షేర్ చేసుకోకుండా వెళ్తున్నారు..తర్వాత డిస్సాప్పాయింట్ గా వచ్చారు మొన్న కాలేజీకి ఫైల్స్ పై సంతాకాలు పెట్టాలని వెళ్లి నిరాశతో వచ్చారు..మొన్న కూడా చెంప కందిపోయి వచ్చాను..ఇప్పుడు కూడా సీన్ రివర్స్ అవుతుందేమో అంటుంది ధరణి. అప్పుడు కోపంగా శైలేంద్ర అంతా బాగానే జరుగుతుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంత హడావుడిగా వెళ్తున్నాడంటే ఏదో ప్లాన్ చేసినట్లున్నాడు అని మనసులో అనుకుంటుంది ధరణి.
దీంతో నేటి ఎపిసోడ్ ముగిసింది..రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: అమెజాన్ ప్రైమ్ వాడే వారికి షాక్.. మళ్లీ రూ.250 కట్టాలా?