Guntur Kaaram Song: మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖలేజా, అతడు తర్వాత త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం కావడంతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. సినిమా రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న గుంటూరు లో గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి.
“మావ ఎంతైనా” సాంగ్ రిలీజ్
ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. “మావ ఎంతైనా” లిరికల్ సాంగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో మహేష్ బాబు విజువల్స్, స్టెప్పులు అదిరిపోయాయి. రిలీజైన కొద్దీ సేపట్లోనే సోషల్ మీడియాలో యమ వైరలవుతుంది ఈ సాంగ్. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. థమన్ మ్యూజిక్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడారు. ఇక రిలీజ్ కు ముందే ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పర్చుకుంది. రీసెంట్ గా సినిమా నుంచి విడుదలైన కుర్చీ మడత పెట్టి సాంగ్ మామూలుగా వైరల్ అవ్వలేదు. మరి జనవరి 12 విడుదలయ్యే గుంటూరు కారం ప్రేక్షకుల అంచనాలను డీ కొడుతుందా లేదా చూడాలి. సినిమాలో మీనాక్షి చౌదరి, శ్రీలీల ప్రధాన పాత్రల్లో కథానాయికలుగా నటించారు.
#MawaaEnthaina song is here to electrify your playlists! 🕺
Full Song out now 🎧 – https://t.co/XNYeAq3jnV
A @MusicThaman Musical 🎹🥁
✍️ #RamajogayyaSastry
🎤 @srikrisin #RamacharyKomanduri #GunturKaaram Super 🌟 @urstrulyMahesh #Trivikram #Thaman @sreeleela14…— Guntur Kaaram (@GunturKaaram) January 10, 2024
Also Read: Ariyana Glory: కుర్రకారుకు కిక్కెస్తున్న అరియానా అందాలు.. ఈ ఫొటోలు చూస్తే మతిపోవాల్సిందే!
THIS IS AN UPDATING STORY
Also Read: Naa Saami Ranga Trailer : కిష్టయ్య వచ్చేశాడు.. ఈ సారి పండక్కి నా సామిరంగ..