ఆకాశంలో కొన్ని సందర్భాల్లో కొన్ని వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని సార్లు ఆకాశం మొత్తంగా ఎర్రగా మారిపోవడం మనం అనేక సందర్భాల్లో చూసే ఉంటాం. ఇలా జరిగిన సందర్భాలు అనేకం ఉంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనల గురించి సోషల్ మీడియాలో చూస్తుంటాం.
కొన్ని నక్షత్రాలు, ఉల్కలు చాలా ప్రకాశవంతంగా ఉండటంతో ఆకాశంలో ఇలాంటి మార్పులు చోటు చేసుకుంటూంటాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 2న టర్కీలోని ఆకాశం పచ్చగా మారింది. ఓ ఉల్కా తన కాంతిని పచ్చ రంగులో వెదజల్లడంతో ఈ వింత చోటు చేసుకుంది. టర్కీలోని ఎర్జురం సిటీ, గుముషానే ప్రావిన్స్‌లో ఈ అసాధారణ దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆకాశం ఆకుపచ్చగా మారడం గురించి కొందరు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఆకాశంలో ఒక్కసారిగా ఆకుపచ్చ రంగు విస్ఫోటనం చెందడం కొందరు చూశారు. దానిని తమ సెల్ ఫోన్లలో బంధించగా క్రమంగా ఆ రంగు ఓ సన్నని గీతగా మారింది. అలా ఆకాశం మొత్తం ఆకుపచ్చగా మారింది.
సోషల్ మీడియాలో ఈ వీడియోలు షేర్ కావడంతో కొందరు నెటిజన్లు ” నేను దీనిని మొట్టమొదటి సారి చూస్తున్నాను..అది అత్యంత భయంకరంగా అనిపించింది అంటూ రాసుకొచ్చారు . మరికొందరేమో మార్వెల్ సినిమా నుంచి ఆకాశం ఇప్పుడే బయటకు వచ్చింది అంటూ రాసుకొచ్చారు.