Nara Brahmani tweet on Gratitude Concert for CBN: ఆదివారం జరిగిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’పై ట్విటర్ వేదికగా స్పందించారు చంద్రబాబు కోడలు, నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మణి. చంద్రబాబు నాయుడి కోసం గచ్చిబౌలిలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ నిజంగా తమ హృదయాలను ఉప్పొంగించిందని పోస్ట్ చేశారు.
The Gratitude Concert for CBN has truly warmed our hearts. Only a statesman like @ncbn garu could have managed to evoke such a heartfelt response from the Telugu community. It’s nothing short of astonishing how he has managed to unite people, even during his absence for over 52… pic.twitter.com/MjY4EMQqKR
— Brahmani Nara (@brahmaninara) October 30, 2023
చంద్రబాబు లాంటి ఒక రాజనీతిజ్ఞుడు మాత్రమే ఈ విధంగా తెలుగు సమాజాన్ని హృదయపూర్వకంగా స్పందింపజేయగలిగారని ఆమె కొనియాడారు. 52 రోజులపాటు ఆయన బయటలేకున్నా ప్రజలను ఏకం చేసిన తీరుకు ఆశ్చర్యపోవాల్సిందేనని అన్నారు. గడిచే ప్రతి రోజూ చంద్రబాబు మద్ధతును రెట్టింపు చేస్తున్నట్టుగా ఉందని బ్రాహ్మణి అన్నారు.నిజాయతీగా, ముక్కుసూటిగా వ్యవహరించే రాజనీతిజ్ఞుడి ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఎంత ప్రయత్నించినా సత్యం ఏంటో ప్రజలకు తెలుసునని, వాళ్లంతా చంద్రబాబు పక్షాన బలంగా నిలబడతారని ఆమె ఆకాంక్షించారు.
Also Read: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఏపీ సీఐడీ మరో కొత్త కేసు
సైబర్టవర్స్ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ జరిగింది. ఈ ఈవెంట్లో చంద్రబాబు అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్ హైదరాబాద్లోని పలుప్రాంతాలవారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ అర్ధాంగి వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు.