Gold Loan – Bullet Repayment Scheme : పట్టణ సహకార బ్యాంకుల కోసం బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్ నిబంధనలను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్చింది. బుల్లెట్ రీపేమెంట్ గోల్డ్ లోన్ స్కీమ్ కింద బంగారంపై (Gold Loan) రుణాన్ని ఆర్బీఐ రెండింతలు చేసి రూ.4 లక్షలకు పెంచింది. ‘బుల్లెట్’ రీపేమెంట్ స్కీమ్ (Bullet’ Repayment Scheme) కింద, రుణగ్రహీత రుణ పదవీకాలం ముగిసే సమయానికి అసలు మొత్తం, వడ్డీని ఒకేసారి చెల్లిస్తారు. బంగారంపై రుణంపై వడ్డీని ప్రతి నెలా లెక్కించినప్పటికీ, అసలు మొత్తం, వడ్డీని ఒకేసారి చెల్లించాలి. అందుకే దీన్ని ‘బుల్లెట్’ రీపేమెంట్ అంటారు. ఏది ఏమైనప్పటికీ, ప్రాథమిక రంగానికి రుణాలివ్వడం కింద అన్ని లక్ష్యాలను చేరుకున్న పట్టణ సహకార బ్యాంకులకు మార్చి 31, 2023 వరకు ఈ పరిమితి పొడిగించింది.
బుల్లెట్ గోల్డ్ రీపేమెంట్ లోన్‌లో, రుణగ్రహీతలు సాధారణ నెలవారీ ఈఎంఐ(EMI)లను చెల్లించాల్సిన అవసరం లేదు. అందువల్ల వారు లోన్‌ను తిరిగి చెల్లించడానికి ఎక్కువ సమయంతోపాటు మరింత సౌలభ్యాన్ని పొందుతారు. ఇంతకుముందు, అన్ని రాష్ట్ర, కేంద్ర సహకార బ్యాంకులు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్‌తో లక్ష రూపాయల వరకు బంగారు రుణాలను అందించాయి. అయితే ప్రస్తుతానికి, అటువంటి రుణాల కాలవ్యవధి సాధారణంగా మంజూరు తేదీ నుండి 12 నెలలకు మించదకూడదు. ఆర్బీఐ (RBI)నిబంధనల ప్రకారం, బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద, బ్యాంకులు వడ్డీతో సహా రుణ మొత్తంపై 75% రుణం-విలువ (LTV) నిష్పత్తిని నిర్వహించాలి. రుణగ్రహీతలు బుల్లెట్ రీపేమెంట్లను పూర్తి చేసిన తర్వాత, వారు తాకట్టు పెట్టిన బంగారాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవచ్చు. మీ వద్ద డబ్బు లేనప్పుడు బుల్లెట్ రీపేమెంట్ కింద పరిమితి రోల్ఓవర్ ఆప్షన్ అనేది మరొక పద్దతి.
ఇది కూడా చదవండి: మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!!
రుణగ్రహీత ఏడాది చివరిలో మొత్తం అసలు, వడ్డీ మొత్తాన్ని చెల్లించిన తర్వాత, రుణ పరిమితి గడువు ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే, రుణగ్రహీత రుణాన్ని తిరిగి చెల్లించి మరుసటి రోజు మళ్లీ లోన్ తీసుకోవచ్చు. ఉదాహరణకు మీరు బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద ఒక సంవత్సర కాలానికి 11% వడ్డీ రేటుతో రూ. 4 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. లోన్ వ్యవధిలో మీరు రుణదాతకు ఎలాంటి వడ్డీ లేదా అసలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు, లోన్ పదవీకాలం ముగిసే సమయానికి, మీరు రూ. 4,43,992 చెల్లించాలి, ఇందులో రూ. 4 లక్షల అసలు మొత్తం. రూ. 43,992 వడ్డీ ఉంటుంది. ఇప్పుడు, మీరు దానిని ఏడాది చివరిలో తిరిగి ఇచ్చిన తర్వాత, మరుసటి రోజు రుణ పరిమితిని మళ్లీ రూ.4 లక్షలకు పెంచుతారు. మరుసటి రోజు నుండి మీరు కొత్త రుణం తీసుకోవచ్చు.
మార్చి 31, 2023 నాటికి ప్రాధాన్యతా రంగ రుణాలు (PSL) కింద మొత్తం లక్ష్యాన్ని పూర్తి చేసిన పట్టణ సహకార బ్యాంకుల (UCBs) కోసం ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షను ప్రకటిస్తూ చెప్పారు. రీపేమెంట్ స్కీమ్ కింద ప్రస్తుతం ఉన్న గోల్డ్ లోన్ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఆయన మాట్లాడుతూ…మార్చి 31న తగిన ప్రోత్సాహకాలు అందజేస్తామని మునుపటి ప్రకటనకు అనుగుణంగానే ఈ నిబంధనలు ఉంటాయని వెల్లడించారు. 2023 నాటికి ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను చేరుకునే యూసీబీలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మార్చి 2023 నాటికి ప్రాధాన్యతా రంగ రుణ లక్ష్యాలను చేరుకునే అర్బన్ యూసీబీలు ఈ ఏడాది జూన్‌లో ద్రవ్య విధాన సమీక్షలో ఆర్బీఐ పేర్కొంది. సహకార బ్యాంకులకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తాయి . ఆర్బీఐ శుక్రవారం వరుసగా నాలుగోసారి పాలసీ రేటు రెపోను 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచింది.