Gangs Of Godavari: మాస్ కా దాస్ విశ్వక్సేన్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి, అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వస్తోంది. విశ్వక్ సేన్ మాస్ అవతార్, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. యూట్యూబ్ లో 2 మిలియన్ ప్లస్ వ్యూస్ తో టాప్ 1 ట్రెండింగ్ గా దుమ్మురేపుతోంది.
న్యూ యార్క్ టైమ్స్ స్క్వేర్ పై ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ట్రైలర్
ఇక ఇప్పుడు గ్యాంగ్స్ గోదావరి మేనియా ఓవర్ సీస్ కు కూడా పాకింది. న్యూయార్క్‌లోని పాపులర్ టైమ్ స్క్వేర్ బిల్డింగ్ పై ఈ మూవీ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతోంది. యూఎస్ఏలో ఈ చిత్రాన్ని కాగ్నియెర్ సినీ క్రియేషన్స్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ చిత్రంలో విశ్వక్ విశ్వక్ సేన్ మునుపెన్నడూ కనిపించని మాస్ అవతార్ లో అదరగొట్టాడు. ట్రైలర్ కోర మీసాలతో గోదావరి యాసలో విశ్వక్ చెప్పిన డైలాగ్స్ మరింత హైలెట్ గా నిలిచాయి. ఈ మూవీలో అయేషా ఖాన్, సాయి కుమార్, గోపరాజ్ రమణ ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Lankala Ratna’s Blockbuster Vibe Reaches New York Times Square 🔥#GangsOfGodavari Overseas release by @Radhakrishnaen9 💥
USA Release by @CognierCC 🇺🇸#GOGTrailer ICYMI ▶️ https://t.co/Y4YcSUmTFJ
Mass Ka Das @VishwakSenActor’s #GOG worldwide grand release at theatres near… pic.twitter.com/0tPCbb7hoA
— Sithara Entertainments (@SitharaEnts) May 26, 2024