8 Telugu Films Releasing this Week: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమా కింగ్ ఆఫ్ కొత్త (King of Kotha) గురువారమే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఇదొక గ్యాంగ్ స్టర్ డ్రామా. దుల్కర్ కెరీర్ లో పూర్తిస్థాయి పాన్ ఇండియా సినిమా ఇది. ఈ మూవీ కోసం భారీగా ప్రచారం చేశాడు దుల్కర్. ఇందులో గ్యాంగ్ స్టర్ గా కనిపించాడు ఈ హీరో.
ఇక శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న సినిమా గాండీవధారి అర్జున(Gandeevadhari Arjuna). ప్రవీణ్ సత్తారు డైరక్ట్ చేసిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej)హీరోగా నటించాడు. సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. ఓ కీలక పాత్రలో నాజర్ కనిపించనున్నాడు. సమాజం పెద్దగా పట్టించుకోని ఓ సమస్యను ఇందులో చర్చించామని చెబుతున్నాడు వరుణ్ తేజ్. సినిమా మొత్తం పూర్తిస్థాయిలో యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయని చెబుతున్నాడు.
గాండీవధారి అర్జునకు పోటీగా వస్తోంది బెదురులంక 2012 (Bedurulanka 2012). కార్తికేయ గుమ్మకొండ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడు.ఇందులో కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty) కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదల అయిన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గోదావరి ఒడ్డున ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో చిత్రీకరించిన సినిమా ఇది.
వీటితో పాటు రెజీనా లీడ్ రోల్ పోషించిన సినిమా నేనేనా (NeneNaa) కూడా థియేటర్లలోకి వస్తోంది. ఆపిల్ ట్రీ స్టూడియోస్ ప్రొడక్షన్ లో “సూర్పనగై” అనే సినిమా చేసింది రెజీనా. కార్తీక్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అక్షర గౌడ , అలీ ఖాన్ , జై ప్రకాష్ వంటి కీలక నటులు నటించారు. శ్యామ్ సి ఎస్ సంగీతం అందించాడు. ఈ సినిమా తెలుగులో నేనేనా పేరుతో రిలీజ్ అవుతోంది. వెన్నెల కిషోర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు.
ఈ సినిమాలతో పాటు… దక్ష, రెంట్, ఏం చేస్తున్నావ్, బాయ్స్ హాస్టల్ (Boys Hostel) లాంటి సినిమాలు కూడా శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో, బాక్సాఫీస్ కు ఏ సినిమా కళ తీసుకొస్తుందో చూడాలి.
Also Read: ఢిల్లీలో నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన.. రేసులో RRR, పుష్ప