Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ మూవీ షూటింగ్స్‌లతో మళ్లీ బిజీ కానున్నారు. కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్.. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)ట్వీట్ చేసింది. సెప్టెంబరు 5 నుంచి ఉస్తాద్ భారీ షెడ్యూల్ జరగనుందని వెల్లడించింది. పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే హైదరాబాద్‌లో ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఓ భారీ సెట్ నిర్మించినట్లు తెలిపింది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
A massive schedule of #UstaadBhagatSingh begins from September 5th ❤️🔥
A Grand set has been erected to shoot some crucial sequences for the film 💥@PawanKalyan @harish2you @sreeleela14 @ThisIsDSP @DoP_Bose #AnandSai @ChotaKPrasad @SonyMusicSouth pic.twitter.com/xZMa7AKbVG
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2023
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ (Harish Shankar) కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) చిత్రం తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. 2012లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ స్టామినా ఏంటో చూపించింది. నాకు కొంచెం తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అని పవన్ చెప్పిన డైలాగ్ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. ఇక డీఎస్పీ (DSP) ఇచ్చిన పాటలు అయితే యూత్‌కు పూనకాలు తెప్పించాయి. మళ్లీ పదకొండేళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో తెరకెక్కితున్న చిత్రం కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లే ఇటీవల విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకుంది.
BRO IN OTT:
ఇక పవన్ మెగా మేనల్లుడితో కలిసి నటించిన బ్రో- ది అవతార్ మూవీ ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 25న నెట్‌ఫ్లిక్స్ (NETFLIX) వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్ కాన్నునట్లు ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. తొలుత ఈ సినిమాను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న స్ట్రీమింగ్ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే వారం రోజుల ముందేప్రసారం చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ చేసింది. వినోదాయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. జీస్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. కేతిక శర్మ హీరోయిన్గా, ప్రియాంక వారియర్.. తేజు చెల్లెలుగా నటించారు.
Also Read: ఇది కదా మెగా ఫ్యాన్స్ అంటే.. చిరంజీవికి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు