Ayodhya Ram Mandir: సోమవారం అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన తరువాత రోజు మంగళవారం నుంచి సామాన్య భక్తులకు ఆయోద్య అధికారులు స్వామి వారి దర్శనాన్ని కల్పించారు. మంగళవారం నుంచి కూడా అయోధ్య బాల రామున్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.
బుధవారం కూడా రామ మందిరం వద్ద భారీ రద్దీ కొనసాగుతోంది. దీంతో దర్శనానికి వేచి ఉండాలని పోలీసులు భక్తులను కోరారు.మంగళవారం నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.
తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు భారీ సంఖ్యలో క్యూ కొట్టారు.అయోధ్య ఐజీ రేంజ్, ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, ఆలయ దర్శనానికి భక్తులు తొందరపడాల్సిన అవసరం లేదని, వారి సమయాన్ని వెచ్చించి దానికి తగినట్లుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.
” అయోధ్య బాలరామున్ని(Bala Ram) చూసేందుకు భక్తులు నాన్ స్టాప్ గా మందిరానికి తరలివస్తున్నారు. వారికి తగిన విధంగా ఏర్పాట్లను చేసినప్పటికీ వారిని ఆపడం , సరైన క్రమంలో వారిని పంపడం చాలా కష్టతరంగా మారింది. అందుకుగానూ వృద్దులు, వికలాంగులు, చిన్నపిల్లలతో వచ్చే వారు ఎవరైనా ఉంటే వారిని రెండు వారాల తరువాత మందిరానికి వచ్చేలా ప్రణాళికలు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఆలయానికి వచ్చే వారు ఉన్ని దుస్తుల్లో రామ మందిరంలోకి ప్రవేశించడానికి , బాల రామునికి ప్రార్థనలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులు లోపలికి ప్రవేశించే ముందు భద్రతా అధికారులు కట్టుదిట్టమైన నిఘా ఉంచడం కనిపించింది.
క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం క్యూ సిస్టమ్‌ను మెరుగుపరిచామని, ‘దర్శనం’ (సందర్శన) సజావుగా సాగుతుందని ఉత్తరప్రదేశ్, లా అండ్ ఆర్డర్, డిజి, ప్రశాంత్ కుమార్ తెలిపారు. సోషల్ మీడియాలో వీడియోల్లో ఉత్తర భారతదేశంలో దట్టమైన పొగమంచు, కొరికే చలి మధ్య అయోధ్యలోని సరయు నదిలో పవిత్ర స్నానం చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
బాల రాముని విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ప్రతిరోజూ రెండు సమయాలలో – ఉదయం 7 నుండి 11:30 వరకు, మరియు మధ్యాహ్నం 2 నుండి 7 గంటల వరకు – రామమందిరాన్ని సందర్శించవచ్చు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ‘దర్శనం’ కొద్దిసేపు ఆగిపోయింది. ఆలయ నిర్వాహకులు, పోలీసుల సమన్వయంతో, విపరీతమైన రద్దీని నిర్వహించడానికి, సందర్శకులందరికీ భద్రత కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
Also read: ”నన్ను పెళ్లి చేసుకుంటావా”.. నిక్కీకి ట్రంప్ మద్దతుదారుని ప్రపోజల్!