Transport Minister Tukuni Sahu: హైవేలపై రాకపోకలు సాగించేలా డ్రైవర్లకు రాత్రిళ్లు ఫ్రీగా టీ (Free Tea) పంపిణీ చేయాలని ఒడిశా (Odisha) రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి టుకుని సాహు చెప్పారు. గురువారం భవనేశ్వర్ లో ఆమె విలేకరులతో మాట్లాడారు. రహదారులపై తరచుగా జరుగుతును్న ప్రమాదాల్లో ఎంతో మంది మరణిస్తున్నారని..ఈ పరిస్థితిని నియంత్రించాలని సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశించారని ఆమె తెలిపారు. హెల్మెట్లు లేకుండా టూవీలర్ నడపరాదని ఇప్పటికే జన చైతన్యం కల్పిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే సరుకు రవాణా వాహనాలు నడుపుతున్న డ్రైవర్లు రాత్రిళ్లు నిద్రలేమితో ఉంటారని అలాంటి సమయంలో రెప్పపాటు కాలంలో దారుణాలు జరుగుతున్నాయని అన్నారు. దీన్ని ద్రుష్టిలో ఉంచుకుని రహదారుల్లో ఉన్న ధాబాలు, హోటళ్లలో లారీ డ్రైవర్లకు ఫ్రీగా చాయ్ పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. అయితే ఈ ఖర్చును సర్కార్ భరిస్తుందని చెప్పారు. డ్రైవర్లు టీ తాగి కాసేపు రెస్టు తీసుకునేలా ట్రక్ టెర్మినల్స్ , వేసైడ్ ఎమినిటీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
భారీ వాహనాల డ్రైవర్లు కాసేపు రెస్టు తీసుకుని ఫ్రీగా టీ తాగే ఏర్పాట్లు చేస్తున్నాం. ట్రక్ టెర్మినల్స్, వేసైడ్ ఎమినిటీ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. 30 జిల్లాల్లో ట్రక్ టెర్మినళ్లు నిర్మిస్తున్నాం. వాటిలో నిద్రించడానికి, స్నానాలు చేయడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. టీ, కాఫీలు కూడా అందుబాటులో ఉంటాయి. కొన్ని జిల్లాల్లో ట్రక్ టెర్మినల్స్ ఏర్పాటు చేశామని మిలిగిన జిల్లాల కలెక్టర్లు టెర్మినల్స్ ఏర్పాటు అనువైన స్థలాలను గుర్తించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. గత 5ఏళ్లలో రాష్ట్రంలో మొత్తం 54,790 ప్రమాదాలు జరిగాయని..వీటిలో 25వేలకు పైగానే జనాలు మరణించారు, 51వేలకు పైగా గాయపడినట్లు మంత్రి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: మల్లన్న భక్తులకు అలర్ట్…ఆ మూడు రోజులు ఆర్జిత అభిషేకాలకు బ్రేక్!
అటు మాజీ సీఎం,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు హైకోర్టులో ఊరట లభించింది. కేసీఆర్ పై 2019లో దాఖలైన ఎలక్షన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గజ్వేల్ నుంచి 2018లో కేసీఆర్ ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ దాఖలపై ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. కాగా కేసీఆర్ ఎన్నికను రద్దు చేయాలని 2019లో సిద్ధిపేట జిల్లా మామిడ్యాలకు చెందిన టి. శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ సమర్పించిన అఫిడవిట్ లో పలు వాస్తవాలను వివరించకుండా గోప్యంగా ఉంచారంటూ పిటిషనర్ ఆరోపించారు.
కేసీఆర్ పై 64 కేసులు నమోదు కాగా.. కేవలం 2 కేసుల గురించి మాత్రమే అఫిడవిట్లో పేర్కొన్నారన్నారు.ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 2018లో జరిగిన ఎన్నికల కాలపరిమితి గడువు ముగిసిన కారణంగా ఎన్నికల పిటిషన్ పై విచారణ కొనసాగింపు అవసరం లేదని వెలువరించిన తీర్పులో స్పష్టం చేశారు. 2018 ఎన్నికల కాలపరిమితి ముగిసిందని.. దీనిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం ఉండదని పిటిషన్‌ను కొట్టివేస్తూ జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.