Chandrababu : టీడీపీ(TDP) అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగాలు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ(APSRTC Free Bus Journey), నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) పేర్కొన్నారు. అసలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నాంది పలికిందే తెలుగుదేశం పార్టీ అని, జగన్(Jagan) అధికారంలోకి వచ్చిన వెంటనే సుమారు 100 సంక్షేమ పథకాలను రద్దు చేశారని ఆయన అన్నారు.
బాబూ ష్యూరిటీ.. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ప్రజలకు సూపర్ సిక్స్ అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ-జనసేన(TDP – Janasena) ఆధ్వర్యంలో త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు(Tiruvuru) లో నిర్వహించిన ” రా.. కదలి రా” బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు.
ఇక వారి ఆటలు సాగవు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగ ఓట్లు చేర్పించి గెలుస్తామనుకునే వైసీపీ నేతల ఆటలు ఇక సాగవని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందే టీడీపీ. జగన్ అలా కుర్చీలోకి రాగానే వంద సంక్షేమ పథకాలను రద్దు చేసిన జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం చేయాలనుకుంటున్నారని బాబు అన్నారు.
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతిని అందిస్తామని బాబు పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా నెలకి రూ.1500 ఇస్తామని, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి 3 సిలిండర్లు , అన్నదాత కింద రైతులకు రూ. 20 వేలు అందజేస్తామని తెలిపారు.
న్యాయం చేసేందుకు సిద్దం..
జయహో బీసీ కింద ప్రత్యేక చట్టం తీసుకోస్తామని, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు న్యాయం చేసేందుకు టీడీపీ సిద్దంగా ఉందని తెలిపారు. దేశంలో నిరుద్యోగంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. టీడీపీ ఉద్యోగాలు తెస్తే..జగన్ రాష్ట్రంలోకి గంజాయి తీసుకువచ్చాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ జనసేన క్యాడర్ ను ప్రజలు చైతన్యం చచేయాలి. రౌడీయిజం చేసి ఎలాగైనా మరోసారి అధికారంలోకి రావాలని జగన్ ప్రయత్నిస్తున్నాడు. ఈసారి అవన్నీ కుదరవు. దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ ఏపీలో మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఉన్న రంగుల పిచ్చితో పొలంలో సర్వే రాళ్ల పై కూడా జగన్ ఫోటో ఉంటుంది.
ఎవరి తరుఫు బంధువు..?
చివరికీ తాతలు ఇచ్చిన ఆస్తులు, పాస్ పుస్తకాల పైకూడా జగన్ ఫోటో ఉంటుంది. జగన్ ఏమన్నా వారి తండ్రి, తల్లి తరుఫున బంధువా? ఫోటో వేయటానికి అంటూ బాబు ప్రశ్నించారు. చివరికి టాయిలెట్ల మీద కూడా జగన్ ఫోటో ఉంది..రానున్న రోజుల్లో టాయిలెట్ల లోపల కూడా జగన్ ఫోటో వేస్తారు అంటూ బాబు విమర్శించారు.
Also read: బిడ్డకు డబ్బాపాలు పట్టిస్తున్నారా..అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!