Rashmika Mandanna: నటి రష్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో దూసుకుపోతున్న రష్మిక మరో అరుదైన ఘనత సాధించింది. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ ప్రతీ సంవత్సరం వివిధ పరిశ్రమల్లో విశేష కృషి చేస్తున్న వ్యక్తుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ఫోర్బ్స్.. ‘ఫోర్బ్స్ ఇండియా 30’ జాబితాను విడుదల చేసింది. ఇందులో యువ వ్యాపార వేత్తలు, ఆవిష్కరణ కర్తలు, క్రీడాకారులు, సంగీతం, సమాజసేవ, ఇంధనం, ఆర్థిక, మీడియా, న్యాయ, వినోదం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్యాషన్ ఇలా పలు రంగాల్లో 30 ఏళ్లలోపు వయసున్న ప్రతిభావంతుల జాబితాను సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో టాలీవుడ్ నటి రష్మిక స్థానం సంపాదించుకుంది. రష్మికతో పాటు మరో ఇద్దరు నటీమణులు రాధికా మదన్, డాట్ ఉన్నారు.
Also Read: Paayal Raajput Video: బాటిల్ తో ప్రియుడి తల పగలగొట్టిన పాయల్.. వైరలవుతున్న వీడియో
View this post on Instagram
ఈ విషయాన్నీ రష్మిక తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నారు. “కృతజ్ఞతగా ఉందంటూ” పోస్ట్ పెట్టారు. పుష్ప పార్ట్ 1 తర్వాత ఇటీవలే యానిమల్ సినిమాతో మరో హిట్ సక్సెస్ అందుకుంది రష్మిక. ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉంది. 2024 ఆగస్టు 15 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: Chiranjeevi: భార్యతో మెగాస్టార్ హాలిడే ట్రిప్.. ఉపాసన ఇంట్రెస్టింగ్ పోస్ట్..!