Digestion: రోజు మనం తినే ఆహారంలో రకరకాల ఆహార పదార్థాలను తీసుకుంటాము. మనం రోజు తినే ఆహారంలో కొన్ని పదార్థాలు జీర్ణ సమస్యను కలిగిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ శరీరాన్ని ఆరోగ్యాంగా ఉంచడంతో పాటు రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది. మన జీర్ణక్రియ(Digestion) ఆరోగ్యాంగా ఉంటే కడుపులో ఏ ఇబ్బంది లేకుండా రోజంతా చక చకా పనులు చేసుకుంటాము. కానీ కొంత మందిలో జీర్ణక్రియ మెరుగ్గా పనిచేయకపోవడం వల్ల గ్యాస్ సమస్యలు, పొట్ట ఉబ్బరంగా ఉన్నట్లు ఇబ్బందిగా ఉంటుంది.
ఇలా జీర్ణక్రియ సమస్యతో బాధపడేవారు మన వంట గదిలో దొరికే అల్లం, పుదీనా ఆకులతో తయారు చేసిన ఈ సింపుల్ చిట్కా అజీర్ణ సమస్యలను దూరం చేయడంతో పాటు, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
అల్లం ప్రయోజనాలు
అల్లం, మెంతి ఆకుల నీటితో తయారు చేసిన ఈ నీటిని తాగితే అది జీర్ణక్రియ పై ప్రభావంగా పనిచేస్తుంది. అల్లంలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి.. ఇది జలుబు, అజీర్ణత, వికారం వంటి సమస్యలకు చక్కటి చిట్కాల పనిచేస్తుంది. అల్లంలో ఉండే ‘జింజరాల్'(Gingerol) అనే కాంపౌండ్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి జబ్బుల నుంచి కాపాడుతుంది. అలాగే దీనిలో ఉండే యాంటీయాక్సిడెంట్స్ జీవక్రియను మెరుగుపరుస్తాయి.
పుదీనా ప్రయోజనాలు
పుదీనాలో ‘మెంథాల్’ అనే నూనె పదార్థం ఉంటుంది. అది జీర్ణక్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా వాడుతారు. పూదీనాలోని యాంటీ ఇంఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు కడుపు ఉబ్బరం, కడుపులో వికారం, అజీర్ణ సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇది ముక్కు దిబ్బడను తగ్గించడానికి చక్కని చిట్కా.
అల్లం, పుదీనా నీటిని తయారు చేసే విధానం
సన్నగా తరిగిన అల్లం ముక్కల్లో చిన్న చిన్న పుదీనా ఆకులను వేసి కాసేపు మరిగించి. తర్వాత దానిని వడకట్టి తాగాలి.. ఇలా రోజులో ఎప్పుడైనా తాగొచ్చు కానీ భోజనం తర్వాత ఈ నీటిని తాగితే అసిడిటీ, కడుపుబ్బరం, అజీర్ణ సమస్యలను దూరం చేయడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
Also Read: Vitamin B12: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే విటమిన్ B12 లోపం ఉన్నట్లే జాగ్రత్త .. ?