Pressure Cooker: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో కుక్కర్ తప్పనిసరిగా ఉంటుంది. అంతే కాదు వీటి వాడకం కూడా ఎక్కువే. ఉడికించడానికి, బేక్ చేయడానికి, ఇలా రకరకాలుగా ప్రెషర్ కుక్కర్ ఉపయోగపడుతుంది. దీనితో వంట చేసే ప్రాసెస్ కూడా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అయితే కొన్ని ఆహారాలను ప్రెషర్ కుక్కర్ లో వండకూడదు. దీని వల్ల ఆహారాలు వాటిలోని పోషకాలతో పాటు రుచిని కూడా కోల్పోతాయి. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము..
సీఫుడ్
సముద్రపు ఆహారాలు.. చేపలు, రొయ్యలు, షెల్ ఫిష్ వంటి వాటిని కుక్కర్లో వండకూడదు. ఇవి సహజంగానే మెత్తగా ఉంటాయి. మళ్ళీ ప్రెషర్ కుక్కర్ లో వండితే మరింత మెత్తగా అవ్వడంతో పాటు రుచిని కూడా కోల్పోతాయి. వీటిని ఉడికించడానికి మీడియం ఫ్లేమ్ సరిపోతుంది.
పాస్తా
పాస్తా కుక్కర్ లో వండితే మరింత సాఫ్ట్ గా, జిగురుగా తయారవుతుంది. ఇది తినడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పాస్తా పాన్ పై చేసుకోవడం బెటర్ అప్షన్.
Also Read: నాన్న పాటకు స్టెప్పులేసిన మహేశ్ ముద్దుల కూతురు.. ధమ్ మసాలా వీడియో వైరల్!
పాల ఉత్పత్తులు
పాల ఉత్పత్తులు ప్రెషర్ కుక్కర్ లో అస్సలు వండకూడదు. అధిక ఉష్ణోగ్రతలో వండడం కారణంగా.. ఆహరం వాటి రుచి, టెక్షర్, పోషకాలను కోల్పోతుంది. వీటిని తిన్నప్పటికీ ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. పన్నీర్, చీజ్ తో కూడిన ఆహారాలు.
బ్రెడ్ తో కూడిన ఆహారాలు
సాధారణంగా ఏదైనా నాన్ వెజ్ రెసిపీ చేసేటప్పుడు బ్రెడ్ క్రంబ్స్ కోటింగ్ లా ఉపయోగిస్తారు. ఇలా బ్రెడ్ తో చేసిన ఆహారాలు కుక్కర్ లో వండితే క్రిస్పీ గా రాకపోవచ్చు. అందుకే వీటి కోసం పాన్ వాడడం బెటర్.
ఫ్రూట్ డెజర్ట్స్
పండ్లతో తయారు చేసే డెజర్ట్స్ లేదా ఇతర ఆహారాలను ప్రెషర్ కుక్కర్ లో వండడం మంచిది కాదు. అధిక ఉష్ణోగ్రతతో ఇవి మరింత మెత్తగా అవ్యుతాయి. అలాగే వీటి ఆకారం, పోషక విలువలను కూడా కోల్పోతాయి.
Brahmamudi Serial: భార్య ముందే వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటున్న రాజ్.. తట్టుకోలేకపోతున్న కావ్య..!