Heart Health: వయసు తో సంబంధం లేకుండా చాలా మందిలో కనిపిస్తున్న సమస్య గుండె సంబంధిత వ్యాధులు. మనం రోజూ తినే ఆహారాలు, జీవన శైలి అలవాట్లు ఈ సమస్యను ఎక్కువ ప్రభావితం చేస్తాయి. గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి మీ ఆహారంలో వీటిని తీసుకోవడం తగ్గించాలి. వీటిలోని హై సోడియం, షుగర్, సాచురేటెడ్ ఫ్యాట్స్ గుండె సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంది.
గుండె ఆరోగ్యానికి హానికరం కలిగించే ఆహారాలు
ఉప్పు, చక్కర
రోజు తినే ఆహారంలో అధిక ఉప్పు, చక్కెర తీసుకోవడం గుండె ఆరోగ్యానికి హానికరం. ఉప్పులోని అధిక సోడియం కంటెంట్ కారణంగా రక్తపోటు స్థాయిలు పెరిగి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే చక్కరలో ఎక్కువ కేలరీలు ఊబకాయం సమస్యను కలిగించి గుండె సమస్యలకు కారణమవుతాయి. అంతే కాదు అధిక ఉప్పు, చక్కర హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
రెడ్ మీట్
తరచుగా రెడ్ మీట్, బీఫ్ వంటి ఆహారాలు తీసుకుంటే గుండె సంబంధిత, మధుమేహ వ్యాధులను కలిగించును. వీటిలోని సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది.
సోడా
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే సోడా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యలు సోడా డ్రింకర్స్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే వైద్య నిపుణులు మెరుగైన గుండె ఆరోగ్యం కోసం సోడా బేస్డ్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలని చెబుతున్నారు.
ఫ్రైడ్ చికెన్
సహజంగానే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆరోగ్యకరం కాదు. వాటిలో ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ చికెన్. ఇది తిన్నప్పుడు డైట్ లో కేలరీస్, ఫ్యాట్, సోడియం కంటెంట్ పెరుగుతుంది. దీని వల్ల గుండె సంబంధిత వ్యాధులు, టైప్ 2 మధుమేహం, ఊబకాయం, రక్తపోటు సమస్యలు వస్తాయి. అందుకే బాయిల్డ్ లేదా రోస్టెడ్ చికెన్ తీసుకోవడం మంచిది.
బటర్
వెన్నలోని సాచురేటెడ్ ఫ్యాట్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. దీని వల్ల గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. రోజూ తినే ఆహారంలో వెన్న, ఇతర ఆయిల్స్ కు బదులు ఆలివ్ ఆయిల్, లేదా వెజిటేబుల్ ఆయిల్ వాడడం మంచిది.
ఫ్రెంచ్ ఫ్రైస్
ఈ మధ్య కాలం చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి విపరీతమైన ఇష్టాన్ని చూపుతున్నారు. కానీ వీటిలోని అధిక ఫ్యాట్, సాల్ట్ కంటెంట్ గుండె ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతాయి. నివేదికల ప్రకారం వారంలో 2-3 సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్, హ్యాష్ బ్రౌన్స్ తిన్నవారు త్వరగా చనిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
Also Read: Health Tips: దాల్చిన చెక్కతో మధుమేహానికి చెక్.. ఎలానో తెలుసా?