Follow these tips for Happy Life: మనమందరం సంతోషంగా, సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాము. కానీ మనం అనుకున్న విధంగా గడపడం చాలా కష్టం. అయితే వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండటం చాలా ముఖ్యం. మరి ఈ సంతోషం ఎలా వస్తుంది?ఒత్తిడి, టెన్షన్స్ నుంచి బయటపడాలంటే..అద్బుతమైన టిప్స్(Tips) గురించి తెలుసుకుందాం. వీటిని పాటించినట్లయితే…మీ జీవితం హాయిగా, హ్యాపీగా ఉంటుందని చెబుతున్నారు మానసిక నిపుణులు.
మనల్ని మనం కాపాడుకోవాలి:
మనకున్న కొద్ది సమయాన్ని విభజించుకోవాలి. మీకంటూ కొంత సమాయాన్ని కేటాయించుకోవాలి. ఈ సమయాన్ని మీకు ఆనందం కలిగించే విధంగా మలచుకోవాలి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటుండాలి. వ్యాయామం, పుస్తకాలు చదవడం, ప్రకృతి ఒడిలో సేదతీరడం వంటివి చేస్తుండాలి.
ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండండి:
మీ సామర్థ్యాన్ని ప్రశ్నించే వ్యక్తులకు దూరంగా ఉండండి. అలాంటి వ్యక్తుల సహవాసం ప్రతికూలతను ఏర్పరుస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తులతో కలిసి ఉండండి. మీ చుట్టూ ఉండేవారు మీ వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తారు.
ఇతరులతో పోల్చుకోకూడదు:
ఇతరులతో పోల్చుకోవం వల్ల చాలా మంది నిరాశకు గురవుతుంటారు. ఇతర వ్యక్తులు ఏం సాధిస్తున్నారన్న విషయంపై దృష్టి పెట్టకుండా, మీరు ఏం సాధించాలన్న లక్ష్యంపై దృష్టి పెట్టండి. ప్రతిరోజూ ఎలా సంతోషంగా ఉండాలో ప్రయత్నించండి.
ఒత్తిడికి దూరంగా:
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ముందుగా మీరు ఒత్తిడికి(Stress) దూరంగా ఉండాలి. ఒత్తిడి స్థాయిని తగ్గించేందుకు మానసిక ప్రశాంతతను పెంచుకునేందుకు యోగా, ధ్యానం చేస్తుండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ..ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
మీకు మీరే బహుమతి ఇచ్చుకోండి:
చాలా మంది డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేస్తుంటారు. అయితే అలా కాకుండా మీకు మీరుగా మీకోసం మీరు ఏదైనా బహుమతిని(Gifts) ఇచ్చుకోండి. మీకోసం డబ్బును అవసరమైన దాని కోసం ఖర్చు పెట్టండి. ఇలా చేయడం వల్లమంచి అనుభూతిని పొందుతారు.
Also Read: 40 ఏండ్లకే మాయరోగాలు.. ఆకస్మిక హార్ట్ ఎటాక్‌లకు కారణమిదే..!!