Flipkart Big Billion Days 2023: ఈరోజు నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మొదలు అయ్యాయి. అసలు బిగ్ బిలియన్ డేస్ రేపటి నుంచి ప్రారంభం కాగా..ఫ్లిప్ కార్ట్ ప్లస్ సభ్యులు ఈరోజు నుంచే కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఈ-ఆఫర్లలో రూ.15 వేల లోపు ధర గల స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసుకుందాం….
ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ (Infinix Hot 30 5G):
ఇన్ఫినిక్స్ తన ఇన్ఫినిక్స్ హాట్ 30 5జీ ఫోన్ ఇటీవలే భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈమొబైల్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో మన ముందుకు వస్తుంది. 6.78 అంగుళాల ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర రూ.12,499 కాగా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్‌లో రూ.11,499లకు లభిస్తుంది. కొన్ని బ్యాంక్ కార్డులపై రూ.1000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
రియల్ మీ 11 ఎక్స్ 5 జీ (Realme 11x 5g):
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ తన రియల్ మీ 11 5 జీ, రియల్ మీ 11 ఎక్స్ 5జీ మొబైల్స్ ను ఆగస్టులోనే ఆవిష్కరించింది. 6 జీబీ ర్యామ్ తో పాటు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.14,999 లకే లభ్యం కానుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా రూ. 2000 డిస్కౌంట్‌తో రూ.12,999 లకు సొంతం చేసుకోవచ్చు. కొన్ని బ్యాంకు కార్డులతో మరో 1000 రూపాయలు రాయితీ పొందొచ్చు.
ఇన్ఫినిక్స్ నోట్ 30 5 జీ (Infinix Note 30 5g):
ఇన్ఫినిక్స్ నోట్ 30 5జీ ఫోన్ ను మార్కెట్లోకి జూన్ నెలలోనే వచ్చింది. 4 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రూ. 14,999 కు లభిస్తుండగా రూ.13,999లకే లభిస్తుంది. కొన్ని సెలెక్టెడ్ బ్యాంకు కార్డులతో రూ.1000 అదనపు డిస్కౌంట్ పొందొచ్చు.
రెడ్ మీ నోట్ 12 5జీ (Redmi Note 12 5g):
షియోమీ నుంచి విడుదల అవుతున్న రెడ్ మీ ఈ ఏడాది మొదట్లోనే రెడ్ మీ నోట్ 12 5 జీ ను మార్కెట్లోనికి తీసుకుని వచ్చింది. ఈ ఫోన్ అసలు ధర రూ.17,999 లు ఉండగా ఈ ఆఫర్లలలో రూ.2000 డిస్కౌంట్ పొందగా..కొన్ని సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల పై మరో రూ.1000 డిసౌంట్ లో పొందవచ్చు. అంటే మొత్తంగా రూ.14,999 లకే సొంతం చేసుకోవచ్చు.
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 34 5 జీ (Samsung Galaxy F34 5g):
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్34 5జీ ఫోన్ 6 జీబీ ర్యామ్ తో 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ తో రూ.18,999 లకే లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో భాగంగా రూ.2500, కొన్ని బ్యాంకు కార్డులపై రూ.1500 డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో ఈ ఫోన్ రూ.14,999లకే పొందవచ్చు.
పొకో ఎక్స్5 5జీ (Poco X5 5g):
పొకో.. పొకో ఎక్స్5 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్ తో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ రూ.20,999లకు లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్స్ లో డిస్కౌంట్ ధరపై రూ.14,999లకే సొంతం చేసుకోవచ్చు.
మోటరోలా జీ 54 5జీ (Motorola G 5g):
మోటరోలా జీ54 5జీ 12 జీబీ ర్యామ్ తో 256 జీబీ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ లాంచింగ్ ధర రూ.18,999. ఫ్లిప్ కార్ట్ సేల్స్ కింద రూ.15,999లకే లభిస్తుంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనంగా రూ.1000 డిస్కౌంట్ పొందొచ్చు.
Also Read: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!