Viral video : ప్రయాణం మధ్యలో సీటు కోసమో, మరేదైనా కారణాలతో ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవలు జరగడం భారత్‌లో మామూలే కానీ.. విదేశీయులు మాత్రం ఇలాంటి చేష్టలు చేయడంలో తక్కువేమీ కాదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి న్యూయార్క్‌లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ కదులుతున్న రైలులో ఓ ప్రయాణికుడు తన పక్కనే కూర్చున్న ప్రయాణికుడిని మోచేతితో బలంగా కొట్టాడు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి : రాహుల్ ది ఆల్‌రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా…!!
రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తన ముందుకు కూర్చున్న ప్రయాణికుడితో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇద్దరు అసభ్య పదజాలంతో తిట్టుకుంటారు. “నేను మీ మాండలికం మాట్లాడతాను. మీరు ఎవరో నాకు తెలుసు. ఎక్కడికైనా పడుకోండి … ఇప్పటికే ఎఫ్***ని మూసివేయండి” అంటూ అసభ్యంగా మాట్లాడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే పక్కన వ్యక్తి మధ్యలో ఏదో మాట్లాడతాడు. కోపంతో రగిలిపోయిన ఆ వ్యక్తి మోచేతితో పిచ్చకొట్టుడు కొడతాడు.
New York man elbows another passenger on the subway #subwaycreatures #nyc #frailego pic.twitter.com/N6KX6ltBIz
— Rama (@EyesWitness00) August 24, 2023
దీంతో ఆ వ్యక్తి దెబ్బలు తట్టుకోలేక బాధితుడు స్పృహతప్పి పడిపోయినట్లు కనిపిస్తుంది. దీంతో ముందు కూర్చున్న వ్యక్తి అతనిపై దాడిచేస్తాడు. ఇద్దరి మధ్య గొడవ రచ్చ రచ్చ అవుతుంది. బాలీవుడ్ సినిమాలో ఫైటింగ్ ను తలిపిస్తుంది. పిడిగుద్దులు గుద్దుతుంటే రెజ్లింగ్ లో ఆటగాళ్ల సీన్ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. న్యూయార్క్ రైలు కాస్త రెజ్లింగ్ కోట్ వలే మారింది. ఇలా ఈ గొడవ చాలా సేపు జరిగింది. రైలులో కూర్చున్న ఇతర ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఫారెస్ట్ హిల్స్ 71వ అవెన్యూ స్టాప్‌కు వెళ్లే క్రమంలో నార్త్‌బౌండ్ F రైలులో ఉదయం 5:30 గంటలకు ఈ గొడవ జరిగిందని తెలిపారు.దాడికి పాల్పడిన వ్యక్తిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి : చంద్రయాన్-3 బాడీ పెయింటింగ్ ఫొటోలు వైరల్.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!