Women’s Savings Plan:చాలా మంది ఇళ్లలో మహిళలు డబ్బును పొదుపుగా ఖర్చు చేస్తుంటారు. అనవసర ఖర్చులను తగ్గిస్తూ..నెలకు సరిపడే విధంగా లెక్కలు ముందుగానే వేసుకుంటారు. ఇంట్లో ఆడవాళ్లు పొదుపు చేస్తేనే ఆ కుటుంబం ఆర్థికంగా బలంగా ఉంటుంది. అయితే చాలా మంది మహిళలు నెలకు సరిపడా సరుకులు కానీ ఇతర ఖర్చులకు పోగా మిగిలిన సొమ్మును పొదుపు చేసుకునే ప్లాన్ చేస్తుంటారు. అలాంటప్పుడు ఎక్కడ సేవింగ్స్ చేస్తే మంచి వడ్డీ వస్తుందని ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్రంలోని మోదీ సర్కార్ మహిళా సమ్మాన్ స్కీంను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కీంలో పెట్టుబడి పెడితే మంచి వడ్డీని పొందవచ్చు. మరి ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?
ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ వస్తుంది…ఏ బ్యాంకులో పెట్టుబడి పెట్టాలి అని చూస్తున్న వారికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఎఫ్డీ కంటే ఎక్కువ వడ్డీని ఇచ్చే ఈ పథకం ప్రయోజనాలను మీరు తెలుసుకోవచ్చు. మహిళల ఔన్నత్యాన్ని నిర్ధారించేందుకు తపాలా శాఖ ద్వారా ‘మహిళా సమ్మాన్ స్కీం-2023’ని అమలు చేస్తున్నారు. మహిళలు, బాలికలతో సహా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ఈ స్కీంలో చేరేందుకు కనీస మొత్తం రూ.1,000 మాత్రమే. గరిష్టంగా రూ.2 లక్షల వరకు చెల్లించవచ్చు. ఒకరు ఎన్ని ఖాతాలనైనా తెరవవచ్చు. ఒక ఖాతా తెరిచిన తర్వాత మరో ఖాతా మధ్య గ్యాప్ 3 నెలలు ఉండాలి. పథకంలో చెల్లించిన పెట్టుబడిపై త్రైమాసికానికి 7.5 శాతం చక్రవడ్డీ అదే ఖాతాలో జమ అవుతుంది. దీని మెచ్యూరిటీ 2 సంవత్సరాలు మాత్రమే.
కావాల్సిన పత్రాలు:
అలాగే, మీరు ఒక సంవత్సరం తర్వాత బ్యాలెన్స్‌లో 40 శాతం వరకు తీసుకోవచ్చు. ఖాతా 6 నెలల తర్వాత మెచ్యూరిటీకి ముందు ఉంటే పెట్టుబడి మొత్తంపై 5.5 శాతం తగ్గిన వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది. ఈ పథకాన్ని ప్రారంభించడానికి మీరు సమీపంలోని పోస్టాఫీసులో దరఖాస్తు చేసుకోవచ్చు.ఖాతాదారులు పథకం కోసం సంబంధిత ఫారమ్‌ను నింపి, అవసరమైన పత్రాలను సమర్పిస్తే సరిపోతుంది. కొత్త దరఖాస్తుదారులకు ఆధార్ కార్డ్ జిరాక్స్, ఫ్యాన్ కార్డ్ నంబర్ రెండు ఫోటోలు అవసరం ఉంటాయి.
బ్యాంక్ ఎఫ్‌డీల కంటే ఎక్కువ వడ్డీ:
మహిళలు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించడమే కాకుండా ఇతర పథకాల్లో కూడా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలనే ఉద్దేశంతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ తీసుకువచ్చింది ప్రభుత్వం. బడ్జెట్ 2023లో ప్రకటించిన మహిళా సమ్మాన్ పొదుపు పథకం మహిళల కోసం స్వల్పకాలిక పొదుపు పథకం. ఈ పథకం 31 మార్చి 2025తో ముగుస్తుంది. మహిళా సమ్మాన్ పొదుపు పథకం బ్యాంక్ FDల కంటే ఎక్కువ వడ్డీని పొందుతుంది. అంటే సంవత్సరానికి 7.5% వడ్డీ చెల్లిస్తారు. 2 సంవత్సరాలలో ఏ బ్యాంకు కూడా ఇంత ఎక్కువ వడ్డీని ఇవ్వదు. కాబట్టి ఈ స్కీం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే ఎంత వస్తుంది?
మీరు ఈ మార్చి 1న రూ.2,00,000 ఇన్వెస్ట్ చేస్తే… 2 సంవత్సరాలలో, ఈ మొత్తం దానిపై వడ్డీతో కలిపి రూ.2,32,044కి పెరుగుతుంది. రూ.2 లక్షలకు 2 ఏళ్లలో రూ.32,044 వడ్డీ లభిస్తుంది.
ఇది కూడా చదవండి: సీఏఏ కొత్త పోర్టల్ షురూ..త్వరలోనే మొబైల్ యాప్..ఏయో పత్రాలు ఉండాలంటే?