కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి టాలీవుడ్ సెలబ్రిటీలు తమ కుటుంబాలతో కలిసి విదేశాలకు చెక్కేస్తున్నారు.మొన్నటికి మొన్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశాలకు పయనమైతే…నిన్నటికి నిన్న జూనియర్ ఎన్టీఆర్ భార్య పిల్లలతో కలిసి జపాన్ ట్రిప్ కి వెళ్లిపోయాడు.
ఇప్పుడు తాజాగా ఆ వంతు అల్లు అర్జున్ కి వచ్చింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా బన్నీ తన కుటుంబానికి చాలా సమయంలో కేటాయిస్తాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో ఉన్న చాలా వీడియోలు నెట్టింట వైరల్ గా మారిన విషయం అభిమానులకు బాగా తెలుసు.
బన్నీ తగినట్లుగానే బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పిల్లలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా వీరంతా కలిసి వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న అర్జున్ కొన్నాళ్లు షూటింగ్‌కి బ్రేక్ చెప్పినట్లు తెలుస్తుంది.
తాజాగా స్నేహ రెడ్డి తన సోషల్ మీడియా ఖాతాలో కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో అల్లు అయాన్ తో పాటు అర్హ కూడా ఉంది. వారంతా సముద్ర తీరాన అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని తెలుస్తుంది. స్నేహ రెడ్డి వీటిని మాత్రమే కాకుండా మరికొన్ని ఫోటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.
ఆ ఫోటోల్లో అర్హ, అయాన్లు ఆటోలో వీధులు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే వీరు ఎక్కడికి వెళ్లారు అనేది మాత్రం అటు అర్జున్ కానీ, స్నేహ కానీ తెలపలేదు.
Also read: తిరగబడ్డ రోబో.. టెస్లా ఇంజనీర్ పై రక్తం వచ్చేలా దాడి.. అసలేమైందంటే?