ప్రస్తుతం ప్రపంచం అంతా ‘ఫేక్(Fake)’ చుట్టూ తిరుగుతుంది. చాలా న్యూస్‌లు సోషల్‌మీడియాలో ఫేక్‌వే ఉంటున్నాయి. ఇటు మనుషులు మరింత ఫేక్‌గా తయారవుతున్నారు. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడం.. అవతలి వ్యక్తులను మోసం చేయడం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, రూమర్స్ క్రియేట్ చేయడం, వాటిని ప్రచారంలోకి తీసుకురావడం, నిందలు వేయడం..ఇలా ప్రతి అంశంలోనూ ఫేక్‌గాళ్లు ఎక్కువైపోయిన రోజులివి. వారితో మనం జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే మన బతుకును బస్టాండ్ చేస్తారు. వారిపట్ల అప్రమత్తంగా ఉండకుండా ఓవర్ కాన్ఫిడెన్స్‌లో ఏమీ కాదులే అనుకుంటే చేయాల్సిందంతా చేసి సైలెంట్‌గా ఏమీ తెలియనట్టు నటిస్తారు. అయితే వారితో ఎలా డీల్ చేయాలో మీకు కొన్ని టిప్స్ అందిస్తున్నాం..
‣ ఫేక్గాళ్లని గుర్తించండి: ముందు అన్నిటికంటే ముఖ్యమైనది ఫేక్ పీపుల్ని గుర్తించడం.. వారు మన చుట్టూనే ఉంటారు. అయినా కనిపెట్టలేం. నిజానికి ఫేక్ మనషుల్లో ఎక్కువగా కనపడేది అస్థిరత. ఇక కపటత్వం ప్రదర్శిస్తారు. వారికి ఏదైనా నీడ్ ఉంటే మంచిగా ఉన్నట్టు నటిస్తారు.. అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా ఉంటారు
‣ సరిహద్దులను సెట్ చేయండి: అలాంటి వారితో ఎప్పుడు లిమిట్లో ఉండండి. ముఖ్యంగా బౌండరీలను సెట్ చేయండి. వీరితో ఎక్కువ టైమ్ ఉంటే మన బుర్రే పాడవుతుంది. మీరు జాలిగా ఉంటే ఆ క్వాలిటీని క్యాష్ చేసుకుని మీతో ఆడుకునే ప్రమాదం ఉంటుంది
‣ మీ సంబంధాలను అంచనా వేయండి: ఫేక్ పీపుల్‌తో అసలు మన రిలేషన్ ఏంటో అర్థం చేసుకోవాలి. వారి రిలేషన్ వదులుకోలేనిదా లేదా అన్నది గుర్తించండి. ఇంకా వారు నిజాయితిగా ఉన్నారో లేదో తెలుసుకోండి. ఆ సంబంధిత వ్యక్తి వల్ల మీ జీవితానికి ఏదైనా వ్యాల్యూ పెరుగుతుందా లేకపోతే కేవలం మిమ్మల్ని యూజ్ చేసుకోవాడినికే మీతో రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారా అన్నది తెలుసుకోండి
‣ ఓపెన్ కమ్యూనికేషన్: ఎవరైనా ఫేక్ అని మీరు అనుమానించినట్లయితే, వారితో నిజాయితీగా సంభాషించండి. మీ ఆందోళనలను వ్యక్తపరచండి.. మీ మాటలకు వారు ఎలా స్పందిస్తారో చూడండి.
‣ పరిచయాన్ని తగ్గించండి: నకిలీ వ్యక్తుల నుంచి క్రమంగా దూరం అవ్వండి. మీ ట్రూ సపోర్టర్స్‌తో ఎక్కువ సమయం గడపండి.
‣ నమ్మకం: ఏ రిలేషన్ అయినా నమ్మకం ముఖ్యం. కొంతమంది తమ మాటలతోనే వారిపై నమ్మకాన్ని కోల్పోయేలా చేసుకుంటారు. ఎవరైనా ఫేక్ అని అనిపిస్తే వారితో సంబంధాన్ని పరిమితం చేయడం లేదా ముగించండి.
‣ చుట్టు ఎవరూ ఉండాలన్నది ముఖ్యం: మన చుట్టూ ఫేక్ మనషులను పెట్టుకుంటే అది ఎప్పటికైనా మనకు బ్యాడ్ చేస్తుంది. అలాంటివారికి దూరంగా ఉండాలి. నిజాయితీతో పాటు మీ విలువలను పంచుకునే వ్యక్తులతో స్నేహం చేయండి.. వారితోనే సంబంధాలను వెతకండి.
‣ స్వీయ సంరక్షణ: స్వీయ సంరక్షణ, వ్యక్తిగత వృద్ధిపై దృష్టి పెట్టండి. ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోవాలి.
‣ అనుభవం నుంచి నేర్చుకోండి: ఫేక్ వ్యక్తులతో కలిసి ఉన్న అనుభవం నుంచి కొత్త విషయాలు, మంచి విషయాలు నేర్చుకోండి. వారిని చూసి ఎలా ఉండకూడదో తెలుస్తుంది.
ALSO READ: చెంపపై కొడితే ఏం అవుతుందో తెలుసా? తల్లిదండ్రులు ఈ తప్పు చేయవద్దు!