Firing in America: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు తీవ్ర కలకలం రేపాయి. నార్త్ కరోలినా యూనివర్శిటీ (North Carolina University)లో విచక్షణారహితంగా ఓ స్టూడెంట్ ఫైరింగ్ కి దిగాడు. ఈ ఘటనలో ప్రొఫెసర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..మరో ముగ్గురు విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యారు.
అయితే సమాచారం అందుకోవడంతో హుటాహుటిన సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కాల్పులకు తెగబడ్డ స్టూడెంట్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక కాల్పుల్లో తీవ్రంగా గాయాలకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా యూనివర్శిటీలో కాల్పుల మోత మోగడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మరో వైపు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ యూనివర్శిటీ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు. అయితే నిందితుడు కాల్పులు జరపడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక గాయపడిన విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
Also Read: హైదరాబాద్ లో మరో దారుణం.. మహిళపై అత్యాచారం.. మర్డర్!